Chiranjeevi: అభివృద్ధి వదిలేసి ఇండస్ట్రీపై పడి ఏడుస్తారు ఏంటి…. ఏపీ ప్రభుత్వం పై చిరు కామెంట్స్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఈయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.గత కొద్దిరోజులు క్రితం బ్రో సినిమా విషయంలో వైయస్సీపీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తుంది. అయితే తాజాగా చిరంజీవి ఈ విషయంపై ఏపీ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయ్యి 200 రోజులు పూర్తి కావడంతో చిత్ర బృందం ఒక వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాల్తేరు వీరయ్య చిత్ర బృందంతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అంబటి రాంబాబును టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ… మీలాంటి పెద్దవాళ్లు రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం, రోడ్ల గురించి, ప్రాజెక్టుల గురించి,పేదవారి ఆకలి తీర్చడానికి ఉపాధి ఉద్యోగ కల్పన గురించి మాట్లాడితే మాలాంటి వాళ్లంతా కూడా తలవంచి నమస్కారం చేస్తాము.

Chiranjeevi: పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏంటి…


ఇలా కాకుండా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీపై ఏడుస్తారు ఎందుకు . ఇదేదో పెద్ద సమస్య లాగా చూడకండి అంటూ ఏపీ ప్రభుత్వం పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.