బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్ కన్నుమూత..!

ఇటీవల కరోనా పాజిటివ్ సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌(72) మాస్టర్‌ కన్నుమూశారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది సేపటి క్రితమే అటే రాత్రి 8 గంటల సమయంలో మరణించాడు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.

అతడు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. తుది శ్వాస విడిచారు. ఇక అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు విజయ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మాస్టార్ సినీ విషయానికి వస్తే.. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో శివశంకర్ మాస్టర్‌కు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టార్ గానే కాకుండా అతడు 30 చిత్రాల్లో కూడా నటించాడు. ఇటీవల కాలంలో అతడు ఓంకార్ సోదరుడి సినిమాలో ఓ కీలక పాత్రను కూడా పోషించాడు.

శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం అతడు కొన్ని టీవీ షోల్లో జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. శివశంకర్ మాస్టర్ 800 చిత్రాలకు పైగా వర్క్ చేశారు. శివశంకర్ మాస్టార్ కన్నుమూతతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

అతడికి కరోనా సోకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తెలవగానే .. సోనూసూద్, హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.