ఇటీవల కరోనా పాజిటివ్ సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్(72) మాస్టర్ కన్నుమూశారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది సేపటి క్రితమే అటే రాత్రి 8 గంటల సమయంలో మరణించాడు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకడంతో కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.
అతడు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. తుది శ్వాస విడిచారు. ఇక అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు విజయ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మాస్టార్ సినీ విషయానికి వస్తే.. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో శివశంకర్ మాస్టర్‌కు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టార్ గానే కాకుండా అతడు 30 చిత్రాల్లో కూడా నటించాడు. ఇటీవల కాలంలో అతడు ఓంకార్ సోదరుడి సినిమాలో ఓ కీలక పాత్రను కూడా పోషించాడు.
శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం అతడు కొన్ని టీవీ షోల్లో జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. శివశంకర్ మాస్టర్ 800 చిత్రాలకు పైగా వర్క్ చేశారు. శివశంకర్ మాస్టార్ కన్నుమూతతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
అతడికి కరోనా సోకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తెలవగానే .. సోనూసూద్, హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…