కృష్ణా నదీ జలాల పిటిషన్​ మరో ధర్మాసనానికి బదిలీ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్‌‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కొర్టు. పిటిషన్‌‌ను నిశితంగా గమనించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయపరంగానే సమస్య పరిష్కారం కోరుకుంటున్నట్లు సీజేఐకి పిటిషన్‌‌ను దాఖలు చేసిన ఏపీసీజేఐ విన్నవించారు. అలాగే ఈ పిటిషన్‌‌ను ధర్మాసనమే విచారణ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని నిరాకరించిన సీజేఐ మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై నేను విచారణ చేపట్టలేనని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు.

nagarjuna sagar

గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవాలంటూ.. అనవసరంగా మూడోవ పక్షం జోక్యాన్ని ఆహ్వానించవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పెర్కొన్న విషయం తెలిసిందే.