Ap: ఏపీలో పింఛన్ల జాతర.. స్వయంగా పింఛనీ పంపిణీ చేసిన చంద్రబాబు!

Ap: ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల జాతర జరుగుతుంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచుతూ జీవో విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మూడో సంతకంగా పింఛన్ల పెంపుపై సంతకం చేశారు. ఈ క్రమంలోనే జులై ఒకటో తేదీ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల జాతర జరుగుతుంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకేసారి 3000 నుంచి 4 వేల రూపాయలకు పెన్షన్ అందజేయడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా వెయ్యి రూపాయలు చొప్పున పెన్షన్ అందు చేస్తామని ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో చంద్రబాబునాయుడు తెలియజేశారు. ఈ క్రమంలోనే చెప్పిన విధంగానే గత మూడు నెలలు 3000 ఈ నెల 4000 రూపాయలు కలిపి ఒక్కొక్కరికి ₹7,000 పెన్షన్ అందజేశారు.

ఇక దివ్యాంగులు ఇతర వ్యాధిగ్రస్తులకు కూడా పెంచిన పెన్షన్ ను సచివాలయ ఉద్యోగస్తులు స్వయంగా ఇంటికి తీసుకువెళ్లి అందజేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ పంపిణీ చేశారు. నేడు ఉదయమే ఈయన పెనమాకలోని ఓ కుటుంబానికి వెళ్లి అక్కడ వారికి స్వయంగా పెన్షన్ అందజేశారు.

పెన్షన్ అందజేసిన బాబు..
ఇలా ఆ కుటుంబం పూరి గుడిసెలో నివసిస్తూ ఉంది అంతేకాకుండా తమకు ఇల్లు లేదని ఆ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకోవడంతో తమకు ఇండ్లు కూడా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడమే కాకుండా ఆ ఇంట్లో చాయ్ తాగుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.