Avinash: బిడ్డను కోల్పోవడంపై మరోసారి స్పందించిన అవినాష్.. ది బెస్ట్ రాబోతుందంటూ?

Avinash: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల అవినాష్ తండ్రి కాబోతున్నారు అంటూ ఈ శుభవార్త అందరికీ తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇలా తన భార్య అనూజ బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే కొన్ని కారణాలవల్ల అవినాష్ బిడ్డ పురటిలో మరణించింది. ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కొన్ని కారణాలవల్ల నా బిడ్డను కోల్పోయాము దయచేసి ఎవరూ కూడా ఈ విషయం గురించి ప్రశ్నలు వేస్తూ మమ్మల్ని బాధ పెట్టకండి నాకు సంతోషం కలిగిన బాధ కలిగిన మీతో పంచుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు.

ఇక అవినాష్ ఎవరు దీని గురించి ప్రశ్నలు అడగద్దు అంటే ఈ విషయాన్ని అందరూ కూడా మర్చిపోయారు కానీ తాజాగా మరోసారి అవినాష్ ఈ విషయం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా మా బాధను అర్థం చేసుకొని ఈ విషయం గురించి మమ్మల్ని ప్రశ్నించలేదని తెలిపారు. అయితే చాలామంది సినిమా వాళ్లు ఇతర నటీనటులు ఫోన్లు చేస్తూనే ఉన్నారని అవినాష్ తెలిపారు.

కరిగిపోయిన మేఘం..

తల్లిదండ్రులు కాబోతున్నామని ఆరోజు కోసం ఎంతో ఎదురు చూశాము కానీ బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన నుంచి మేము కూడా త్వరగానే కోలుకున్నాము ఇది మా జీవితంలో కరిగిపోయిన మేఘం లాంటిదని తెలిపారు. ఇలా బిడ్డను కోల్పోగా ఫ్యూచర్లో మాకు ఇంకా ది బెస్ట్ రాబోతుందేమో అనుకుంటున్నాము అంటూ ఈ సందర్భంగా ఆమెనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.