Upasana: ఉపాసన ఇటీవల తన తాతయ్య పుట్టినరోజు సందర్భంగా ది అపోలో స్టోరీస్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో భాగంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈమెకు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా హీరో విజయ్ పార్టీ స్థాపించడం పట్ల ఈమెకు ప్రశ్నలు ఎదురు కాగ ఉపాసన సమాధానం చెబుతూ.. విజయ్ సినిమాల ద్వారా ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సహాయం చేయాలి అంటే నాయకుడు ఎవరు అని ఆలోచించకుండా సహాయం చేయండి లేదంటే చేసే వారిని వెనక్కి లాగకండి అంటూ సమాధానం చెప్పారు.
మనం ఎప్పుడైతే కొత్త నాయకుడికి సపోర్ట్ చేస్తామో అప్పుడే మార్పు అనేది కూడా వస్తుందని ఉపాసన తెలిపారు. తమిళనాడులో కూడా ఆ మార్పులు వస్తాయని నేను ఆశిస్తున్నాను అంటూ ఈమె వెల్లడించారు సామాజిక సేవ కార్యక్రమాలలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన రాజకీయాలలోకి రాబోతున్నారా అనే ప్రశ్న ఎదురయింది.
రాజకీయాలలోకి మాత్రం రాను..
ఈ ప్రశ్నకు ఉపాసన సమాధానం చెబుతూ నేను రాజకీయాలలోకి రావడం అనేది మాత్రం జరగదని తెలిపారు. కానీ మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించే నాయకుడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈమె తెలిపారు. ఇలా రాజకీయాల గురించి ఉపాసన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈమె పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…