భారత చట్టాలకు కట్టుబడే ఉన్నాం.. : గూగల్ సీఈవో సుందర్ పిచాయ్ !

సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి కొత్త ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కీలక వ్షయాఖ్ల్యలు చేసారు గూగుల్ సీఈవో. సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ చట్టాలకు తాము లోబడే పనిచేస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ ఎప్పుడూ స్థానిక చట్టాలకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు అనుగుణంగా తాము సేవలు అందించనున్నట్లు సీఈవో పిచాయ్ తెలిపారు.

రాజ్యాంగ విధానాల‌ను త‌మ కంపెనీ ఎల్లప్పుడూ గౌర‌విస్తుంద‌ని, అవ‌స‌ర‌మైన చోట వెన‌క్కి త‌గ్గిన‌ట్లు కూడా ఆయ‌న గుర్తుచేశారు. ప్రస్తుతం టెక్నాల‌జీతో ప్ర‌పంచ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని, సాంకేతిక ప‌రిజ్ఞానం స‌మాజాన్ని చాలా మార్చేసిందని అయన అన్నారు. యూరోప్‌లో కూడా కాపీరైట్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయ‌ని, ఇండియాలో సమాచార నియంత్ర‌ణ ఉంద‌ని, అలానే వివిధ దేశాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణించి తాము ముందుకు వెళ్తున్న‌ట్లు సుంద‌ర్ పిచాయ్ తెలిపారు