సుక్కు.. ఏంటిది జర్నలిస్టు దగ్గర ‘పుష్ప’ కథను కాపీ కొట్టారా.. జర్నలిస్టు ఆవేదన!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ఫ మూవీపై మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. బన్నీ కెరీర్ లో తొలిసారిగా ప్యాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా రావడంతో భారీగా క్రేజ్ ఏర్పడింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం పుష్ప విఫలమైందని అభిమానులు అంటున్నారు.

యావరేజ్ టాక్ తెచ్చుకుంది పుష్ఫ. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. కలెక్షన్ల పరంగా చూస్తే పుష్ప హిట్ అయినట్లే. అయితే సుకుమార్ గత చిత్రాలు లాజికల్ గా నడిచేవి. ఇతర సినిమాల ప్రభావం ఏమి లేకుండా, కాపీలు లేకుండా సుకుమార్ సినిమాలు ఉండేవి. కానీ పుష్ప విషయంలో మాత్రం లెక్కల మాస్టార్ లెక్క తప్పింది. ‘పుష్ప’ కథ తన దగ్గర నుంచి కొట్టేశారంటూ సీనియర్ జర్నలిస్ట్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. కవి, రచయిత, నాటకరంగంలో ప్రావీణ్యం ఉన్న ఆదినారాయణ అనే జర్నలిస్ట్ చాలా ఏళ్లుగా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.

సినిమా రంగంపై ఇష్టంతో కథలు కూడా రాస్తుంటాడు. ఇతను రాసే రివ్యూలకు జనాదరణ ఉంది. గతంలో రంగస్థలం రివ్యూ రాసినప్పుడు సుకుమార్ నుంచి ప్రశంసలు అందాయి. అదే సమయంలో సుకుమార్ ను కలిసే అవకాశం వచ్చింది. ఇలా కలిసిన సందర్భంతో కేజీఎఫ్ లాంటి బ్యాక్ గ్రౌండ్ కలిగిన కథకావాలని అడిగినట్లు ఆదినారయణ వెల్లడించారు. అయితే ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ తో సాగే కథను చెప్పానని.. అందుకు అవసరమైన కంటెంట్ అందించానని వెల్లడించాడు. ఏమైందో ఏమో కానీ ఆ కథను నానుంచి నొక్కేశాడని ఆరోపణలు చేస్తున్నాడు సదరు జర్నలిస్ట్. అంతే కాదు తాను రాసిన కంటెంట్.. మెయిల్స్ కూడా ఈ పోస్ట్‌లో జత చేయడం విశేషం. ఈ విషయంపై పుష్ప లోని ఊ అంటావా మావా..ఊఊ అంటావా. పాటకు పేరడీ రాసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. 

కవి, రచయిత, నాటకరంగంలో ప్రావీణ్యం ఉన్న ఆదినారాయణ అనే జర్నలిస్ట్ చాలా ఏళ్లుగా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సినిమాలపై ఉన్న మక్కువతో సొంతంగా కథలు రాస్తుంటారు. ఇక సినిమా రివ్యూలు రాయడంలో కూడా అతనికి ప్రత్యేక శైలి. ‘రంగస్థలం’ సినిమా రివ్యూకి దర్శకుడి సుకుమార్ ప్రశంసలు దక్కించుని ఆయన్ని మీట్ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. అప్పుడే కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ స్థాయి కథ కావాలని ఈ జర్నలిస్ట్‌ని సుకుమార్ అడిగారని.. అప్పుడు రెడ్ శాండిల్ నేపథ్యంలో ‘పుష్ప’ లైన్ ఇచ్చానని.. మాస్ ఎలిమెంట్స్ కావాలంటే.. కంటెంట్ కూడా ఇచ్చానని చెప్తూ ఆ తరువాత ఏమైందో.. తన కథను ఎలా నొక్కేశారో వివరిస్తూ వ్యగ్యంగా పోస్ట్ పెట్టారు.

అంతే కాదు తాను రాసిన కంటెంట్.. మెయిల్స్ కూడా ఈ పోస్ట్‌లో జత చేయడం విశేషం. పుష్ప చిత్రంలో ఊ అంటూ ఉహూ అంటావా మామా? సాంగ్‌ని పేరడీ చేస్తూ తనకి జరిగిన అన్యాయాన్ని వివరించాడు ఆది నారాయణ. సుక్కూ అంటే కాపీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ (టిట్టీటి టిట్టీటి టిట్టీటీ)  అంటూ సాగే పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సుక్కు చేసిన అన్యాయాన్ని పాట రూపంలో వివరించాడు జర్నలిస్ట్ ఆది నారాయణ.