క్రీమ్ ఫంగస్ అంటే ఏమిటి.. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది.. ఎలా నివారించాలి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దాడి చేస్తున్న నేపథ్యంలోనే కొందరు కరోనా నుంచి సురక్షితంగా బయట పడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ వివిధ రకాల ఫంగస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ విధమైనటువంటి ఫంగస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా క్రీమ్ ఫంగస్ అనే కొత్త రకం వైరస్ బయటపడటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

క్రీమ్ ఫంగస్ అంటే ఐస్ క్రీమ్ తినడం వల్ల వస్తుందని భావించడం పొరపాటు. తాజాగా ఈ క్రీమ్ ఫంగస్ మధ్యప్రదేశ్,జబల్పూర్‌ జిల్లాలో… ఓ పేషెంట్‌లో గుర్తించారు. అదే పేషెంట్‌కి ఆల్రెడీ కరోనా సోకింది. బ్లాక్ ఫంగస్ కూడా సోకింది. ప్రస్తుతం అతనిలో క్రీమ్ ఫంగస్ బయటపడటంతో అతను సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలోని ENT డిపార్ట్‌మెంట్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో కొన్ని వందల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి.

బ్లాక్ ఫంగస్ కరోనా సోకిన వారికి చికిత్సలో భాగంగా అధిక మొత్తంలో యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల వారి శరీరంలో కరోనా వైరస్ తగ్గటంతో పాటు మన శరీరంలో మనకు రక్షణ కలిగించే బ్యాక్టీరియాలు సైతం నశించి పోతున్నాయి. ఈ క్రమంలోనే మనం వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాము. మన శరీరంలోని ప్రేగులలో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అన్ని కణాలకు శక్తిని అందిస్తుంది.వ్యాధికారక బ్యాక్టీరియాలు మన శరీరం పై దాడి చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాతో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాలు వాటిని నాశనం చేస్తాయి.

ప్రస్తుతం కరోనా చికిత్సలో భాగంగా అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా నశించిపోయి మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రో బ్యాక్టీరియా అధికంగా పెరుగు మజ్జిగలో ఉంటుంది. మన శరీరంలో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసుకోవాలంటే తప్పనిసరిగా రోజుకు రెండుసార్లు పెరుగు లేదా మజ్జిగతో భోజనం చేయాలని, దీని ద్వారా ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసుకొని రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం వ్యాపిస్తున్న క్రీమ్ ఫంగస్ అంటే ఏమిటి అనే దాని పై డాక్టర్లు పూర్తి అవగాహనకు రాలేదు. అయితే ఇది ఇతర ఫంగస్ ల కంటే ప్రమాదకరమైనదని కనుక ప్రతి ఒక్కరు వీలైనంతవరకు వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.