General News

కూతురు పుట్టిందని అంత పని చేసిన వ్యక్తి.. ఏం చేశాడంటే?

ప్రస్తుత కాలంలో కూతురు పడుతుందని తెలియగానే ఎంతో బరువుగా భావించి వారిని పొత్తిళ్లలోనే పరలోకానికి పంపుతున్నారు. మరికొందరికి ముళ్ళ పొదలు, చెత్త కుండీలు ఆశ్రయంగా మారాయి.ప్రపంచం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో ఆడపిల్లల పట్ల ఉన్న ఈ విధమైనటువంటి భావన మాత్రం మారడం లేదు. ప్రతిరోజు ఆడపిల్లల పట్ల వివక్షత చూపిస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సందర్భంలోనే ఓ వ్యక్తి తన కూతురు పుట్టిందని అతడు చేసిన పనికి గ్రామం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఖానాపూర్ లో మరబోయిన నవీన్‌కు శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే తన కూతురు పుట్టిందని ఏమాత్రం కృంగిపోకుండా తనకు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయాడు.ఈ క్రమంలోని తన కూతురు పుట్టిన విషయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలోనే తనకు కూతురు పుట్టిన సంతోషాన్ని ఊరందరికీ నాలుగైదు రోజులకు సరిపడే కూరగాయలను ప్రతి ఇంటికీ పంచి తన ఆనందాన్ని పంచుకొని వేడుకగా జరుపుకున్నారు.

గ్రామంలోని 300 ఇండ్లకు కూరగాయలను పంచుతూ తన కూతురు పుట్టిందని, తన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని నవీన్ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. ఈ విధంగా తనకు కూతురు పుట్టిన సందర్భంగా గ్రామం మొత్తానికి కూరగాయలు పంచడంతో గ్రామస్తులందరూ అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునే ఈ రోజుల్లో ఈ విధంగా గ్రామస్తులు అందరికీ సహాయం చేయడంతో గ్రామస్తులు అతనిని పొగడ్తలతో ముంచెత్తారు.

ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఈ విధంగా తన మిత్రుల సహాయంతో కూరగాయలు పంచడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ విధంగా గ్రామస్తులు అందరికీ సేవచేసే అదృష్టం రావడం ఎంతో సంతోషంగా ఉందని నవీన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago