Zee Saregamapa Singer: రూపం కాకిలా.. గొంతు కోకిలలా అంటూ హేళన.. జీ సరిగమప పార్వతి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు..!

Dasari Parvathi: ఆమె సరిగమల పూదోటలో విరిసిన కుసుమం. ఎంతో ప్రతిభ ఉన్నా సరైన అవకాశం లేక ఎంతో ఎదురు చూసింది. అయితే నేడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఒకప్పుడు ఆమెను హేళన చేసిన వారే నేడు దేవత అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె మధురమైన స్వరానికి అందరూ మంత్రముగ్ధుల్ని అయ్యారు.

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా జీ తెలుగులో ప్రసారం కాబోయే సరిగమప సింగింగ్ కాంపిటీషన్ లో భాగంగా సరికొత్త కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ అద్భుతమైన గాత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇక ఇందులో భాగంగా దాసరి పార్వతి అనే ఓ యువతి పాడిన పాటలకు మాత్రమే కాకుండా జడ్జీలు సైతం ఆమె పాటకు మంత్రముగ్దులయ్యారు.

Dasari Parvathi: రూపం కాకిలా.. గొంతు కోకిలలా అంటూ హేళన చేశారు…. నేడు దేవత అంటున్నారు!

కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామంలో వ్యవసాయమే  జీవనాధారంగా బ్రతుకుతున్న కుటుంబంలో జన్మించింది దాసరి పార్వతి. ఈమెకు ఇద్దరు అన్నయ్యలు.ఇంటర్ వరకు చదివిన ఈమె చదువు మానేసి సంగీతంపై ఆసక్తి ఉండడంతో ప్రతిరోజు పక్క ఊరికి వెళ్లి సంగీతం నేర్చుకుంది. అయితే వారి గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేక కాలినడకన వెళ్లి కష్టపడి సంగీతం నేర్చుకున్న పార్వతి సరిగమప కార్యక్రమంపై తన పాటతో అందరిని మైమరిపించారు.

Dasari Parvathi: రూపం కాకిలా.. గొంతు కోకిలలా అంటూ హేళన చేశారు…. నేడు దేవత అంటున్నారు!

గ్రామానికి బస్సు సౌకర్యం…

తన అద్భుతమైన గాత్రానికి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులై ఆమె పై ప్రశంసలు కురిపించారు.ఇక చూడటానికి నలుపు రంగులో ఉన్న పార్వతి కలర్ ముఖ్యం కాదు.. కంటెంట్ ముఖ్యం అని నిరూపించారు.ఒకప్పుడు ఆమె రంగు చూసి రూపం కాకిలా .. గొంతు కోకిల అంటూ హేళన చేశారని అయితే ఆనాడు హేళన చేసిన వారే నేడు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పవచ్చు.ఎంతో అద్భుతంగా పాడిన పాటకు మైమరిచిన జడ్జ్ ఏం కావాలో కోరుకో అని చెప్పగా నిస్వార్థంతో మా ఊరికి బస్సు సౌకర్యం లేదు సార్ బస్సు కావాలని అడగడంతో తన మనస్సు ఏంటో తెలుస్తుంది.ఇలా మొదటి పాటతోనే ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న పార్వతి ముందు ముందు మంచి అవకాశాలను దక్కించుకోవాలని కోరుకుందాం.