Delhi murder case: అఫ్తాబ్ ను ఉరి తీయాలి… డేటింగ్ అప్స్ ను నిషేదించండి… పోలీసులు ఆలస్యంగా స్పందించారు …. శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్

Delhi murder Case : దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన హత్య కేసు ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ అనే యువతి హత్య. ప్రేమించిన వ్యక్తి ఆఫ్తాబ్ ముక్కలుముక్కలుగా ఆమెను నరికి ఒక్కో చోట ఒక్కో శరీర భాగాన్ని పడేయడం శ్రద్ధ తలను మాత్రం ఇంట్లోనే పెట్టుకుని కొన్ని రోజులు ఉండటం లాంటి ఒళ్ళు గగుర్పొడిచే అంశాలు ఎన్నో ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. ఇంత కిరతకంగా ఆమెను చంపినా అతనికి సహకరించిన వారికీ కఠినంగా శిక్ష పడాలంటూ యావత్ భారత దేశం కోరుకుంటోంది. ఇక సంఘటన జరిగిన చాలా రోజులకు శ్రద్ధ తండ్రి వికాస్ మీడియా ముందు మాట్లాడారు. అనేక సూచనలను ప్రభుత్వానికి అలాగే పోలీసులకు చేసారు.

డేటింగ్ అప్స్ ను బ్యాన్ చేయండి….

వికాస్ వాకర్ కూతురు మరణం భరించలేక అనారోగ్యానికి గురవడం వల్ల ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదంటూ చెప్పారు. శ్రద్ధను చంపిన ఆ సైకొ ని కూడా శ్రద్ధ ను ఎలా హింసించి చంపడో అలానే చంపాలంటూ కోరాడు. మహారాష్ట్ర పోలీసుల అలసత్వమే నా కూతురు చనిపోవడానికి కారణం అంటూ తెలిపిన వికాస్ వాకర్ ప్రస్తుతం దర్యాప్తు పై సంతృప్తి ని వ్యక్తం చేయారు. 18 ఏళ్ళు పై బడిన యువత మీద దృష్టి పెట్టాలని వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ సూచించారు.

డేటింగ్ అప్స్ వల్ల యువత తప్పుదోవ పడుతోందని వాటిని నిషేదించాలంటూ ప్రభుత్వానికి సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ హత్య కేసులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారంటు తెలిపారు. రెండేళ్లుగా శ్రద్ధాను కలిసేందుకు ప్రయత్నించినా శ్రద్ధ స్పందించలేదన్నారు. శ్రద్ధ శరీర భాగాలు ఆ హంతకుడి ఇంట్లో ఉన్న సమయంలోనే అఫ్తాబ్‌ని కలిశానని ఆవేదన వ్యక్తం చేశారు.అఫ్తాబ్ ను అతనికి సహకరింకచిన తన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ తెలిపారు.