బుమ్రా పెళ్లి తో అనుపమ హర్ట్ అయ్యే ఈ పని చేసిందా..?

అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా లో ఎప్పుడు ప్రజల నోళ్ళల్లో నానుతూ ఉంటుంది..ఇటీవలే ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలిం కూడా యూట్యూబ్ లో తెగ హిట్ అయిపోవడంతో అనుపమ ఇప్పుడు నేలమీద లేదు.. ఈ దెబ్బతో అయినా ఆమెకు తెలుగు లోసినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు.నితిన్ హీరో గా నటించిన ‘అ ఆ’ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది.

తొలి సినిమా తో హిట్ కొట్టడమే కాకుండా ఆ పాత్ర లో నటనతో అందరిని మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ప్రేమమ్ తో హిట్ కొట్టి వెంటనే శతమానం భవతి సినిమా తో హిట్ కొట్టి టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన హీరోయిన్ గా అవతరించింది. అయితే ఈ సక్సెస్ ని ఆమె కంటిన్యూ చేయలేకపోయింది..ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ – స్క్రీన్ ప్లే అందిస్తున్న ’18 పేజెస్’ సినిమా లో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.. నిఖిల్ కథానాయకుడు..

ఇక గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బ్యూటీ అనుమప పరమేశ్వరన్, యువ క్రికెటర్ బుమ్రా ల మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ సంజన గణేశన్‌‌ని బుమ్రా పెళ్లాడారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇంతవరకూ బాగానే ఉన్నా బుమ్రా పెళ్లి జరిగిన మరుసటి రోజే హీరోయిన్ అనుమప పరమేశ్వరన్ ఇలా విరహ గీతం పాడి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడం కొత్త చర్చలకు తెరలేపింది.ఇప్పటికిప్పుడు బుమ్రా పెళ్లి కాగానే ఇలా విరహ గీతం పాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పుకుంటున్నారు జనం.