Junior NTR: కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..!

Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చాలామంది తారక్ అని కూడా పిలుస్తారు. అతను స్టార్‌డమ్‌కి ఎదిగిన తర్వాత.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు తన కెరీర్ మళ్లీ మొదటికి రావడంతో భయపడ్డానని.. నటుడిగా తాను అయోమయంలో పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తాను ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత తన ‘బౌన్సింగ్ బోర్డ్’ లాగా ఎస్‌ఎస్ రాజమౌళి నిలబడ్డాడని.. అతడికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

Junior NTR: కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..!
Junior NTR: కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..!

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా SS రాజమౌళితో కలిసి తన దర్శకత్వంలో తొలి స్టూడెంట్ నంబర్ 1 (2001)లో పనిచేశాడు. అతను దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలు- సింహాద్రి (2003) మరియు యమదొంగ (2007)లో కూడా నటించాడు. వీరిద్దరూ తమ రాబోయే ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ కోసం జతకట్టారు. ఆర్జే సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ప్రారంభ సంవత్సరాలను గుర్తుచేసుకున్నాడు. తాను 17 సంవత్సరాల వయస్సులో కెరీర్ ను ప్రారంభించానని.. 18 సంవత్సరాల వయస్సులో రాజమౌళి తెరకెక్కించిన విజయవంతమైన చిత్రం స్టూడెంట్ నంబర్ 1లో నటించానని చెప్పాడు.

Junior NTR: ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..!

తర్వాత తన కెరీర్ సింహాద్రి చిత్రం వరకు దూసుకుపోయిందని అన్నాడు. దీని తర్వాతనే వర్కవుట్ కాని సినిమాలు ఎదురయ్యాయని.. తాను నిరాశకు గురయ్యానని.. డిప్రెషన్ లోకి కూడా వెళ్లాను అని చెప్పాడు. నటుడిగా నాకు నేనే కన్ఫ్యూజ్ అయ్యా అని ఎన్టీఆర్ తెలిపాడు. ఆ సమయంలో “నేను ఏమి చేయాలో నాకు తెలియదు.. ఎందుకంటే అప్పుడే తన కెరీర్ ప్రారంభం కాలేదు.. కొత్తగా ఏం చేయాలన్నా భయపడే వాడిని అంటూ చెప్పాడు.

ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల..

ఇటువంటి టైంలోనే మళ్లీ రాజమౌళి.. బౌన్స్ బోర్డ్‌గా ఉన్నాడన్నారు. రాజమౌళి సాయంతో నటుడిగా నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నా కెరీర్ కూడా మారింది. నా విజయాల పట్ల నాకు సంతృప్తి లేదు. కానీ ఈరోజు నేను ఒక నటుడిగా సంతృప్తితో ఉన్నా అని ఎన్టీఆర్ తెలిపారు. రాజమౌళి సహాయంతోనే తాను ఆత్మపరిశీలన చేసుకున్నానని.. అప్పటి నుంచే తన కెరీర్ మారిపోయిందన్నారు. నేను నా కంఫర్ట్ జోన్‌ను వదిలి నటుడిగా కొత్త ప్రదేశాలను అన్వేషించడం ప్రారంభించానన్నారు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న RRR సినిమా హిందీ, తమిళం, మలయాళం , కన్నడ భాషల్లో విడుదల కానుంది.