Thaman: నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..! భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్..!
Thaman: థమన్ తెలుగు సంగీత ప్రపంచంలో పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తెలుగులో పాటు తమిళం, కన్నడలో కూడా తన మ్యాజిక్ చూపిస్తున్నారు థమన్. తాజాగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ’అఖండ‘ మూవీ మ్యూజిక్ పరంగా కూడా హిట్ అయింది.
చిన్న తనం నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో.. తన ప్రతిభతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.
తాత ఘంటసాల బలరామయ్య గురించి కూడా చెప్పుకొచ్చారు. తాత బలరామయ్య ఏఎన్నార్ తో కలిసి చాలా సినిమాలు చేశారని థమన్ చెప్పుకొచ్చారు.
నాన్నకు సంగీతంపై ఆసక్తి ఉండేదని దాదాపు 1,000 సినిమాలకు డ్రమ్స్ వాయించారని థమన్ అన్నారు. సంగీత కుటుంబంలో పుట్టడం వల్ల సహజంగానే థమన్ కు సంగీతంపై మక్కువ ఏర్పడింది. తన నాన్న చనిపోయి దాదాపుగా 27 ఏళ్లు అయిందని.. చెల్లి ఐటీ జాబ్ చేస్తుందని.. తాను కూడా సంగీతంపై మక్కువతో సింగర్ గా మారిందన్నారు.
తాజాగా తన భార్య శ్రీవర్థిని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు థమన్. తను నాకోసం చాలా త్యాగం చేసిందని.. పనిలో పడి తనతో ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతున్నా అన్నాడు థమన్. తన భార్య కూడా సింగర్ అని.. నా డైరెక్షన్ లో 5 సాంగ్స్ పాడిందని థమన్ వెల్లడించారు. నా కొడుకు కూడా సింగర్ అని.. అయితే తనముందు పాడాలంటే సిగ్గని అన్నారు. సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటున్న థమన్.. వచ్చే ఏడాది భారీ చిత్రాలకు మ్యూజిక్ ను అందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…