Tag Archives: music director

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం.. కూతురు భవతరణి కన్నుమూత!

Ilayaraja: తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలకు మంచి మంచి సంగీతాలను అందించి సంగీత దర్శకుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఇళయరాజా. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన కూతురు, గాయకురాలు భవతరణి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్​తో​ పోరాడుతున్న ఆమె తాజాగా తుది శ్వాస విడిచారు. తాజాగా పరిస్థితి విషమించడం వల్ల శ్రీలంకలోని ఒక ప్రైవైట్​ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు.

ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి గురువారం ఆమె కన్నుమూశారు. జనవరి 26 సాయంత్రం ఆమె భౌతికకాయం చెన్నైకి రానున్నట్లు తెలిసింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులు కూడా నెట్టింట్లో ఇళయరాజా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలలుపుతున్నారు. కూతురి మరణంతో ఇళయరాజా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి సారథ్యంలో ఎక్కువ పాటలు..

ఇకపోతే భవతరణి విషయానికి వస్తే.. ఈమె తమిళంలో పలు సినిమాలకు మంచి మంచి సాంగ్స్ పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఎక్కువగా తన తండ్రి, సోదరుల సంగీత సారథ్యంలోనే ఎక్కువగా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతి సినిమాలోని మయిల్ పోల పొన్ను ఒన్ను అనే తమిళ సాంగ్‌కు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా పొందారు. కాగా సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా నేడు సాయంత్రం ఆమె భౌతిక కాయం చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. రేపు అనగా జనవరి 27 ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Koti: వద్దురా విడిపోవద్దు అన్నాడు… మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మరణం పై ఎమోషనల్ అయిన కోటి!

Koti: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా సంగీత దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను పాటలను ప్రేక్షకులకు అందించిన రాజ్ వరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి అయితే రాజ్ కోటి ఈ ఇద్దరు పేర్లను విడదీయడం చాలా కష్టం. చిన్నప్పటినుంచి ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ దాదాపు 180 సినిమాలకు కలిసే సంగీతమందించారు.

ఇలా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నింటికీ రాజ్ కోటి సంగీతం అని రాజ్ కోటి పాటలంటూ పేర్లు పెట్టేవారు. ఇలా రాజ్ కోటి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి అయితే కొన్ని పరిస్థితుల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఇలా ఇద్దరు విడిపోయిన కూడా కోటి గారి నుంచి వచ్చే పాటలను రాజ్ కోటి పాటలు గానే పిలిచేవారనీ తాజాగా కోటి రాజ్ మరణ వార్త తెలుసుకొని ఎమోషనల్ అవుతూ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే రాజ్ మరణ వార్త పై కోటి స్పందిస్తూ ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నానని కోటి తెలిపారు.నా రాజ్ చనిపోయారన్న వార్త నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇటీవల కాలంలో ఒక ఫంక్షన్ లో కలిసాము ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు నాకు అసలు అనిపించలేదు రాజు కూడా చెప్పలేదని ఆయన మరణ వార్తను తలుచుకొని కోటి ఎమోషనల్ అయ్యారు.

Koti: పాటల రూపంలో కలిసే ఉంటాం….

చక్రవర్తి వద్ద మేమిద్దరం అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తామని అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించిన మేమిద్దరం పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను విడిపోయే సమయంలో రాజు వద్దురా విడిపోవద్దు అని బ్రతిమలాడారు. అయితే పరిస్థితులు నన్ను వేరు చేశాయని, కానీ వేమిద్దరం పాటల రూపంలో ఎప్పటికీ కలిసి ఉంటాము అంటూ ఈ సందర్భంగా కోటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Singer Palak: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ను పెళ్ళాడిన బాలీవుడ్ సింగర్.. ఫోటోలు వైరల్!

Singer Palak: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత సెలబ్రిటీల మధ్య ప్రేమలు, డేటింగులు, బ్రేకప్ లు సర్వసాధారణం.ఇలా ఎంతోమంది ప్రేమించుకుని పెళ్లి చేసుకోగా మరి కొంతమంది రిలేషన్ లో ఉంటూ వారి రిలేషన్ బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోని తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సైతం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పాలక్ ఎమ్మెస్ ధోని, ఆషీకీ 2, ఏక్ థా టైగర్ వంటి సినిమాలలో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రముఖ డైరెక్టర్ మిథున్ శర్మతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

ఈ విధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే వీరికి పెళ్లి జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా పెళ్లి దుస్తులలో ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ జంట పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎల్లప్పుడూ ఇద్దరం ఇలా కలిసి ఉండాలని ఒక్కటయ్యాం అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

Singer Palak: హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు…

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ సెలబ్రిటీల వివాహ రిసెప్షన్ కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం సింగర్ పాలక్ మిధున్ పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Singer Suneetha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ సునీత.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

Singer Suneetha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే సునీత గత ఏడాది మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో సునీత కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సునీత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారు అడిగిన పాటలను కూడా పాడుతూ పెద్ద ఎత్తున అందరిని సందడి చేస్తున్నారు.

Singer Suneetha: వన్ మినిట్ మ్యూజిక్ వీడియో…

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇలా ఈమె చెప్పిన విషయం విన్న అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సునీత తన అభిమానుల కోసం ఇన్స్టాగ్రామ్ ద్వారా వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలను చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తాను ఒక మ్యూజిక్ వీడియో చేశానని ఇకపై ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయబోతున్నానని ప్రకటించారు.ఇక ఈమె ఈ విషయం తెలియజేయడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Music Director Koti: సింగర్స్ పాడినంత మాత్రాన ఆ పాటలు వారివి కాదు… మేము పాడిస్తే వారు పాడతారు.. కోటి షాకింగ్ కామెంట్స్!

Music Director Koti: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ సంగీత దర్శకులుగా కోటి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన సంగీత సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి ఎన్నో ప్రశంసలు అవార్డులను అందుకున్న కోటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు.

Music Director Koti: సింగర్స్ పాడినంత మాత్రాన ఆ పాటలు వారివి కాదు… మేము పాడిస్తే వారు పాడతారు.. కోటి షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంగీతం అందించాలంటే ఎంత కష్టపడాలో ఆయన వివరించారు. ఇలా ఆ పాట రూపొందడానికి సంగీతదర్శకుల కృషి ఎంతో ఉంటుంది. అయితే ఆ పాట మంచి విజయం అందుకుంటే అది మాత్రం సంగీత దర్శకుల ఖాతాలోకి రాదు. ఆ పాట పాడిన వారికే ఆ క్రెడిట్ దక్కుతుందని కోటి ఈ సందర్భంగా తెలియజేశారు.

Music Director Koti: సింగర్స్ పాడినంత మాత్రాన ఆ పాటలు వారివి కాదు… మేము పాడిస్తే వారు పాడతారు.. కోటి షాకింగ్ కామెంట్స్!

అయితే అది పూర్తిగా తప్పు పాట పాడినంత మాత్రాన ఆ పాట క్రెడిట్ మొత్తం సింగర్ ది కాదు.దాని వెనుక ఎంతో కృషి చేసిన సంగీత దర్శకులది దీనిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోటి తెలియజేశారు. ఎంత గొప్ప సింగర్స్ పాడిన ఆ పాటలు ఎప్పటికీ మావే అని ఈయన వెల్లడించారు. ఇక ఈయన సంగీతంలో ఎక్కువగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాటలు పాడారు తనైతే ఎంతో అవలీలగా పాటలు పాడేస్తారు.

ఎవరితోనూ విభేదాలు లేవు…

కొత్తవారికి అవకాశం ఇస్తే మేము ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అప్పట్లో అంత సమయం మాకు ఉండేది కాదని కోటి తెలియజేశారు. ఇక తన సినిమాలలో ఎంతోమంది సింగర్స్ పాటలు పాడారు. అయితే తనకు ఎవరితోనూ ఏ విధమైనటువంటి విభేదాలు లేవని కోటి తెలియజేశారు. ఇక గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాలకు మ్యూజిక్ అందించడం చాలా తేలిక అంటూ కోటి ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Koti : చిరంజీవి సినిమాలు చేయాలంటే భయం… మోహన్ బాబు నీ ఆర్కెస్ట్రా ప్యాకప్ అన్నాడు.. నువ్వేవరు ప్యాక్ అప్ చెప్పడానికి అని అరిచా..!

Music Director Koti: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో దర్శకుడు కోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు మెలోడీ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కోటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Music Director Koti: చిరంజీవి సినిమాలు చేయాలంటే భయం… మోహన్ బాబు ప్యాకప్ చెబితే అరిచా… కోటి షాకింగ్ కామెంట్స్!

తాను సంగీతదర్శకుడిగా స్టార్ హీరోలందరికీ ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను అందించానని వెల్లడించారు. ఈ క్రమంలోనే చిరంజీవి గారి సినిమాలు ప్రతి ఒకటి సూపర్ హిట్ అని ఈ సందర్భంగా వెల్లడించారు.చిరంజీవి సినిమాలు చేయాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది కానీ ఒకసారి ఆయన సినిమాలు చేశాను అంటే చాలా భయం పుడుతుందని కోటి వెల్లడించారు. చిరంజీవి సినిమా అంటే ప్రతి ఒక్క పాట హిట్ కావాలి. అలా హిట్ కావాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలని ఈ సందర్భంగా ఆయన సినిమాలు చేయాలంటే నా వెన్నులో వణుకు పుడుతోందని కోటి తెలిపారు.

Music Director Koti: చిరంజీవి సినిమాలు చేయాలంటే భయం… మోహన్ బాబు ప్యాకప్ చెబితే అరిచా… కోటి షాకింగ్ కామెంట్స్!

ఇక మోహన్ బాబుకు కూడా తాను ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించానని ఈ సందర్భంగా కోటి చెబుతూ వారిద్దరి మధ్య జరిగిన ఓ సన్నివేశం గురించి వెల్లడించారు. సాధారణంగా మోహన్ బాబుకి కోపం ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి మోహన్ బాబు పై కోటి గట్టిగా అరిచానని ఈ సందర్భంగా వెల్లడించారు.

మీరెవరు ప్యాకప్ చెప్పడానికి…

ఒక సినిమా షూటింగ్ కోసం పనిచేస్తున్న సమయంలో నేను ఏదో కోపంలో ఆర్కెస్ట్రా ప్యాకప్ అంటూ గట్టిగా అరిచాను. అంతలోగా మోహన్ బాబు కూడా కోపంగా వచ్చి ఆర్కెస్ట్రా ప్యాకప్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆర్కెస్ట్రా నాది నేను ప్యాకప్ చెప్పాలి మీరు ఎవరు ప్యాకప్ చెప్పడానికి… మీరెలా ప్యాకప్ చెబుతారు అంటూ గట్టిగా మోహన్ బాబు గారి పై అరిచానని ఈ సందర్భంగా కోటి తెలిపారు. ఇలా రెండు రోజుల వరకు మేము ఇద్దరం మాట్లాడుకోలేదని ఆ తర్వాత అంతా మామూలుగా జరిగిపోయిందని కోటి తెలియజేశారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ ! ఎంతో నమ్మి వాడికి పనిస్తే.. ఇలా చేస్తాడని అనుకోలేదు : తమన్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరెకెక్కితున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతలో వీరికి పిడుగులాంటి షాక్ తగిలింది. ఈ సినిమాలోని కళావతి సాంగ్ ను వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయాల్సి ఉండగా.. దాని కంటే ముందే నెట్టింట్లో చక్కెర్లు కొట్టింది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

ఈ పాటకు సంబంధించి ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ప్రేమికుల రోజున విడుదల చేసి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న మూవీ మేకర్స్ కు లీక్ రాజాలు షాక్ ఇచ్చారు. నెట్లో ఈ ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రతీది లీక్ అవుతూనే వస్తోంది. మొన్నటికి మొన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌.. నేడు మొదటి లిరికల్ సాంగ్.. ఇలా ప్రతీది పైరసీ బారిన పడుతోంది. మొదటి నుంచి కూడా పైరసీ సినిమా రంగాన్ని వదిలి పెట్టడం లేదు. ఇలా సినిమా విడుదల కాకముందే లీక్ ల ద్వారా పాటలు, పోస్టర్లను విడుదల చేయడంతో.. అభిమానులు మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ..

ఇదిలా ఉండగా.. దీనిపై సంగీత దర్శకుడు థమన్ తీవ్ర ఆవేదన చెందారు. ఇలా జరగడం తనను ఎంతో బాధ కలిగించిందని.. ఈ పాట కోసం దాదాపు 6నెలలు కష్టపడ్డామన్నారు. ఈ పాట షూటింగ్ సమయంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారని తెలిపాడు. ఈ పాట షూటింగ్‌ సమయంలో 9మందికి కరోనా పాజిటీవ్‌ కూడా వచ్చిందని తెలిపారు. అందుకే మధ్యలో షూటింగ్ నిలిపివేసి.. మళ్లీ స్టార్ట్ చేశామని అన్నారు.
ఇంత కష్టపడి చేసిన పాటను ఇలా సింపుల్ గా నెట్టింట్లో విడుదల చేశారు.. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె పగిలినంత పనైంది అంటూ ఆవేదన చెందాడు. తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని.. తన లైఫ్ లో ఎన్నో ఎదుర్కొన్నాను… కానీ ఈ విషయంపై తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పారు. పైరసీ అంటే ఎంత ఘోరమైన చర్యో తెలియాలనే తాను ఈ ఆడియో నోట్ ను పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నానని.. ట్విట్టర్ ఖాతాలో అతడు తన ఆడియో ఫైల్ ను షేర్ చేశాడు. ఇక ఈ పాట లీక్ అయిన నేపథ్యంలో నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Indian Idol Telugu: ఇండియన్ ఐడల్ కు జడ్జిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..!షోకు మైలేజ్ వచ్చినట్లేనా..?

Indian Idol Telugu: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మ్యూజిక్ తో  టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. 2009లో రవితేజ కిక్ మూవీతో తొలి మ్యూజిక్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల కరోనా బారి పడిన థమన్.. ప్రస్తుతం కోలుకున్నాడు. 

Indian Idol Telugu: ఇండియన్ ఐడల్ కు జడ్జిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..!షోకు మైలేజ్ వచ్చినట్లేనా..?

ఇదిలా ఉంటే ఇటీవల అఖండ మూవీకి ఇచ్చిన బీజీఎంతో థమన్ పేరు మారుమోగింది. థమన్ కొట్టిన బీజేఎంకు థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థమన్ మ్యూజిక్ తో థియేటర్లలో బాక్సులు బద్దలయ్యేంత పని అయింది.

Indian Idol Telugu: ఇండియన్ ఐడల్ కు జడ్జిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..!షోకు మైలేజ్ వచ్చినట్లేనా..?

దీంతో పాటు ప్రస్తుతం థమన్ ‘భీమ్లానాయక్’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ‘ సర్కారి వారి పాట’కు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు థమన్. 

ఆహాలో త్వరలో రాబోతోంది..

ఇదిలా ఉంటే థమన్ కు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఆహాలో త్వరలో రాబోతున్న ‘ఇండియన్ ఐడల్’ రియాలిటీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆహాలో సమంత ‘సామ్ జామ్’, లేటెస్ట్ గా బాలయ్య హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘ అన్ స్టాపబుల్‘ షోలు భారీ హిట్ అయ్యాయి. దీంతో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఇండియన్ ఐడల్ కూడా పెద్ద సక్సెస్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. థమన్ జడ్జిగా వస్తే షోకు ఖచ్చితంగా మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని నిర్వహకులు అనుకుంటున్నారు.

Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!

Divorce: నాగచైతన్య- సమంత విడాకుల వ్యవహారం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరు విడిపోవడం వీరి ఫ్యాన్స్ కూడా మింగుడుపడలేదు. వీరితో పాటు 2021లో పలువురు ఫేమస్ కపుల్స్ విడిపోయారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్- కిరణ్ రావులు కూడా విడాకులు తీసుకున్నారు.

Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!

వీరితో పాటు రిలేషన్ షిప్ లో ఉన్న సుస్మితా సేన్- రోహ్మన్ షాల్ కూడా విడిపోయారు. అయితే తాజాగా దక్షిణాది సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్-మోనికా రిచర్డ్ దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు.
దక్షిణాది సినీ పరిశ్రమలో నాగ చైతన్య – సమంత విడాకుల అనంతరం అంతే సంచలనం కలిగించి విషయం తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ తన వివహ బంధానికి స్వస్తి పలకడం కూడా అంతే సంచలన కలిగించింది.

Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!

13 ఏళ్ల తమ వివాహ బంధానికి ఇమ్మాన్, మోనికా రిచర్డ్ స్వస్తి చెప్పారు. వాస్తవానికి 2020 లోనే ఈ జంట విడిపోయింది. అయితే తాజాగా ఈవిషయాన్ని ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. సౌత్ ఇండస్ట్రీలో ఇలా సెలబ్రిటీ జంటలు విడిపోవడం సెన్సెషన్ క్రియేట్ చేస్తున్నాయి.  నా శ్రేయోభిలాషులకు, సంగీత ప్రియులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

చట్టబద్ధంగానే విడాకులు..

మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహన, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టాడు ఇమ్మాన్‌.  డి. ఇమ్మాన్ తమిళంలో స్టార్ మ్యూజిషియన్ గా ఉన్నాడు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇటీవల రజినీ కాంత్ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్నగా డబ్బింగ్ అయిన సినిమాకు ఇమ్మాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. అంతకు ముందు అజిత్ విశ్వాసం సినిమాకు కూడా సంగీతం అందించాడు.

Thaman: నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..! భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్..!

Thaman: థమన్ తెలుగు సంగీత ప్రపంచంలో పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తెలుగులో పాటు తమిళం, కన్నడలో కూడా తన మ్యాజిక్ చూపిస్తున్నారు థమన్. తాజాగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ’అఖండ‘ మూవీ మ్యూజిక్ పరంగా కూడా హిట్ అయింది.

Thaman: నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..! భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్..!

చిన్న తనం నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో.. తన ప్రతిభతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.
తాత ఘంటసాల బలరామయ్య గురించి కూడా చెప్పుకొచ్చారు. తాత బలరామయ్య ఏఎన్నార్ తో కలిసి చాలా సినిమాలు చేశారని థమన్ చెప్పుకొచ్చారు.

Thaman: నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది..! భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్..!

నాన్నకు సంగీతంపై ఆసక్తి ఉండేదని దాదాపు 1,000 సినిమాలకు డ్రమ్స్ వాయించారని థమన్ అన్నారు. సంగీత కుటుంబంలో పుట్టడం వల్ల సహజంగానే థమన్ కు సంగీతంపై మక్కువ ఏర్పడింది. తన నాన్న చనిపోయి దాదాపుగా 27 ఏళ్లు అయిందని.. చెల్లి ఐటీ జాబ్ చేస్తుందని.. తాను కూడా సంగీతంపై మక్కువతో సింగర్ గా మారిందన్నారు. 

తను నాకోసం చాలా త్యాగం చేసిందంటున్న థమన్..

తాజాగా తన భార్య శ్రీవర్థిని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు థమన్. తను నాకోసం చాలా త్యాగం చేసిందని.. పనిలో పడి తనతో ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతున్నా అన్నాడు థమన్. తన భార్య కూడా సింగర్ అని.. నా డైరెక్షన్ లో 5 సాంగ్స్ పాడిందని థమన్ వెల్లడించారు. నా కొడుకు కూడా సింగర్ అని.. అయితే తనముందు పాడాలంటే సిగ్గని అన్నారు. సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటున్న థమన్.. వచ్చే ఏడాది భారీ చిత్రాలకు మ్యూజిక్ ను అందిస్తున్నారు.