Singer Suneetha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే సునీత గత ఏడాది మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో సునీత కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సునీత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారు అడిగిన పాటలను కూడా పాడుతూ పెద్ద ఎత్తున అందరిని సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇలా ఈమె చెప్పిన విషయం విన్న అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సునీత తన అభిమానుల కోసం ఇన్స్టాగ్రామ్ ద్వారా వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలను చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తాను ఒక మ్యూజిక్ వీడియో చేశానని ఇకపై ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయబోతున్నానని ప్రకటించారు.ఇక ఈమె ఈ విషయం తెలియజేయడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…