Featured

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ ! ఎంతో నమ్మి వాడికి పనిస్తే.. ఇలా చేస్తాడని అనుకోలేదు : తమన్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరెకెక్కితున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతలో వీరికి పిడుగులాంటి షాక్ తగిలింది. ఈ సినిమాలోని కళావతి సాంగ్ ను వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయాల్సి ఉండగా.. దాని కంటే ముందే నెట్టింట్లో చక్కెర్లు కొట్టింది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

ఈ పాటకు సంబంధించి ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ప్రేమికుల రోజున విడుదల చేసి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న మూవీ మేకర్స్ కు లీక్ రాజాలు షాక్ ఇచ్చారు. నెట్లో ఈ ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రతీది లీక్ అవుతూనే వస్తోంది. మొన్నటికి మొన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌.. నేడు మొదటి లిరికల్ సాంగ్.. ఇలా ప్రతీది పైరసీ బారిన పడుతోంది. మొదటి నుంచి కూడా పైరసీ సినిమా రంగాన్ని వదిలి పెట్టడం లేదు. ఇలా సినిమా విడుదల కాకముందే లీక్ ల ద్వారా పాటలు, పోస్టర్లను విడుదల చేయడంతో.. అభిమానులు మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ..

ఇదిలా ఉండగా.. దీనిపై సంగీత దర్శకుడు థమన్ తీవ్ర ఆవేదన చెందారు. ఇలా జరగడం తనను ఎంతో బాధ కలిగించిందని.. ఈ పాట కోసం దాదాపు 6నెలలు కష్టపడ్డామన్నారు. ఈ పాట షూటింగ్ సమయంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారని తెలిపాడు. ఈ పాట షూటింగ్‌ సమయంలో 9మందికి కరోనా పాజిటీవ్‌ కూడా వచ్చిందని తెలిపారు. అందుకే మధ్యలో షూటింగ్ నిలిపివేసి.. మళ్లీ స్టార్ట్ చేశామని అన్నారు.
ఇంత కష్టపడి చేసిన పాటను ఇలా సింపుల్ గా నెట్టింట్లో విడుదల చేశారు.. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె పగిలినంత పనైంది అంటూ ఆవేదన చెందాడు. తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని.. తన లైఫ్ లో ఎన్నో ఎదుర్కొన్నాను… కానీ ఈ విషయంపై తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పారు. పైరసీ అంటే ఎంత ఘోరమైన చర్యో తెలియాలనే తాను ఈ ఆడియో నోట్ ను పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నానని.. ట్విట్టర్ ఖాతాలో అతడు తన ఆడియో ఫైల్ ను షేర్ చేశాడు. ఇక ఈ పాట లీక్ అయిన నేపథ్యంలో నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago