Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరెకెక్కితున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతలో వీరికి పిడుగులాంటి షాక్ తగిలింది. ఈ సినిమాలోని కళావతి సాంగ్ ను వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయాల్సి ఉండగా.. దాని కంటే ముందే నెట్టింట్లో చక్కెర్లు కొట్టింది.

ఈ పాటకు సంబంధించి ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ప్రేమికుల రోజున విడుదల చేసి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న మూవీ మేకర్స్ కు లీక్ రాజాలు షాక్ ఇచ్చారు. నెట్లో ఈ ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రతీది లీక్ అవుతూనే వస్తోంది. మొన్నటికి మొన్న ఫస్ట్‌లుక్ పోస్టర్.. నేడు మొదటి లిరికల్ సాంగ్.. ఇలా ప్రతీది పైరసీ బారిన పడుతోంది. మొదటి నుంచి కూడా పైరసీ సినిమా రంగాన్ని వదిలి పెట్టడం లేదు. ఇలా సినిమా విడుదల కాకముందే లీక్ ల ద్వారా పాటలు, పోస్టర్లను విడుదల చేయడంతో.. అభిమానులు మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ..
ఇదిలా ఉండగా.. దీనిపై సంగీత దర్శకుడు థమన్ తీవ్ర ఆవేదన చెందారు. ఇలా జరగడం తనను ఎంతో బాధ కలిగించిందని.. ఈ పాట కోసం దాదాపు 6నెలలు కష్టపడ్డామన్నారు. ఈ పాట షూటింగ్ సమయంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారని తెలిపాడు. ఈ పాట షూటింగ్ సమయంలో 9మందికి కరోనా పాజిటీవ్ కూడా వచ్చిందని తెలిపారు. అందుకే మధ్యలో షూటింగ్ నిలిపివేసి.. మళ్లీ స్టార్ట్ చేశామని అన్నారు.
ఇంత కష్టపడి చేసిన పాటను ఇలా సింపుల్ గా నెట్టింట్లో విడుదల చేశారు.. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె పగిలినంత పనైంది అంటూ ఆవేదన చెందాడు. తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని.. తన లైఫ్ లో ఎన్నో ఎదుర్కొన్నాను… కానీ ఈ విషయంపై తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పారు. పైరసీ అంటే ఎంత ఘోరమైన చర్యో తెలియాలనే తాను ఈ ఆడియో నోట్ ను పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నానని.. ట్విట్టర్ ఖాతాలో అతడు తన ఆడియో ఫైల్ ను షేర్ చేశాడు. ఇక ఈ పాట లీక్ అయిన నేపథ్యంలో నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.



























