Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!

0
544

Egg Benefits: రోజుకో గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అనే కొటేషన్ మనం వింటూనే ఉంటాం. గుడ్డు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటిలో ఎన్నో రకాల పోషక పదర్థాలు ఉన్నాయి. ఇక దీనిని నాన్ వెజ్ తినని వారు కూడా.. వారి ఆహార పదర్థాల్లో గుడ్డును చేర్చుకుంటున్నారు.

Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!
Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!

ఇక ఒకప్పుడు ఫ్రిడ్జ్ లో కూరగాయలు, పండ్లను మాత్రమే నిల్వ చేసుకునే వారు. కానీ మారుతున్న జీవన శైలి.. బిజీ బిజీ జీవితంలో ప్రతీ వస్తువును ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా కోడిగుడ్లు కూడా ఉన్నాయి. అయితే ఇలా గుడ్లను నిల్వ చేయవచ్చా..? దీని వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా.? ఒక వేళ ఇలా నిల్వ చేస్తే ఎన్ని రోజులు ఉంచాలి.. వాటి గురించి తెలుసుకుందాం.

Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!
Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!

గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కోడి గుడ్లను నిల్వ చేయడం అనేది మాంచిది. ఒక వేళ గుడ్డన ఫ్రిడ్జ్ లో నిల్వ చేయాలంటే.. ఒక బాక్స్ లో ఉంంచి.. గాలి తగలకుండా ఉంచాలి. ఇలా ఉంచితే.. మిగతా వస్తువుల వాసన గుడ్డుకు తగలకుండా ఉంటుంది.

రెండు గంటల పాటు.. బయట ఆరపెట్టాలని ..

ఒక వేల గాలి తగిలితే.. గుడ్డు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ సైడ్ డోర్ లో గుడ్లను నిల్వ ఉంచకూడదు. డోర్ తీస్తున్న సమయంలో బయట వాతావరణం.. ఫ్రిడ్జ్ లో ఉన్న వాతావరణం కలిసి.. గుడ్డు లోపల బాక్టీరియా తయారయి చెడిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నిల్వ ఉన్న గుడ్లను బటయకు తీసి వండే క్రమంలో.. రెండు గంటల పాటు.. బయట ఆరపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా పైన చెప్పిన విధంగా చేస్తే గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచితే తినే అవకాశం ఉంటుంది.