Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదట్లో లేడీ కంటెస్టెంట్ లు లేకుండా కేవలం మగవారు మాత్రమే పాత్రకు అనుగుణంగా లేడీ గెటప్స్ వేసేవారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో కూడా లేడీ కంటెస్టెంట్ లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంతోమంది లేడీ కంటెస్టెంట్ లో వచ్చి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వర్ష ఒకరు. ఈమె ఇమ్మానియేల్ కి జోడిగా ఎన్నో స్కిట్ లలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన వర్ష గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా వర్ష చావుబతుకుల్లో ఉందంటూ ఫేక్థంబ్‌నెయిల్‌తో ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. సాధారణంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వారి ఛానల్ వ్యూస్ కోసం ఇలాంటి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం సర్వసాధారణం ఈ క్రమంలోనే వర్ష గురించి ఇలాంటి వార్త రావడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నిజంగానే తనకు ఏమైందో అంటూ ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు.
బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న వర్ష..
ఈ విధంగా తన గురించి వస్తున్న వార్తలపై స్పందించిన వర్ష తను చావు బతికులలో ఉందనే థంబ్‌నెయిల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఇదంతా కూడా ఫేక్ అని తనకు ఏమీ కాలేదు అంటూ తన ఆరోగ్యంగా ఉన్నానని వర్ష తన గురించి వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు. ఇక వర్ష ఈ విషయం పై స్పందించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్షకు బిగ్ బాస్ 6 అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి ఉంది.



























