Movie News

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం.. కూతురు భవతరణి కన్నుమూత!

Ilayaraja: తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలకు మంచి మంచి సంగీతాలను అందించి సంగీత దర్శకుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఇళయరాజా. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన కూతురు, గాయకురాలు భవతరణి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్​తో​ పోరాడుతున్న ఆమె తాజాగా తుది శ్వాస విడిచారు. తాజాగా పరిస్థితి విషమించడం వల్ల శ్రీలంకలోని ఒక ప్రైవైట్​ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు.

ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి గురువారం ఆమె కన్నుమూశారు. జనవరి 26 సాయంత్రం ఆమె భౌతికకాయం చెన్నైకి రానున్నట్లు తెలిసింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులు కూడా నెట్టింట్లో ఇళయరాజా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలలుపుతున్నారు. కూతురి మరణంతో ఇళయరాజా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి సారథ్యంలో ఎక్కువ పాటలు..

ఇకపోతే భవతరణి విషయానికి వస్తే.. ఈమె తమిళంలో పలు సినిమాలకు మంచి మంచి సాంగ్స్ పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఎక్కువగా తన తండ్రి, సోదరుల సంగీత సారథ్యంలోనే ఎక్కువగా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతి సినిమాలోని మయిల్ పోల పొన్ను ఒన్ను అనే తమిళ సాంగ్‌కు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా పొందారు. కాగా సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా నేడు సాయంత్రం ఆమె భౌతిక కాయం చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. రేపు అనగా జనవరి 27 ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

3 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

11 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

12 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

12 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago