Movie News

Krithi Shetty : కృతి శెట్టికి షాకింగ్ అనుభవం.. శ్రీ లీలా అనుకొని బేబమ్మను పొగిడిన అభిమాని?

Krithi Shetty: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఈమె మాచర్ల నియోజకవర్గం, కస్టడీ బంగార్రాజు, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో కృతి శెట్టి ఎటువంటి సినిమాలలో నటించలేదు. ఇటీవలె ఒక సినిమాను కూడా ప్రకటించింది.

తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. కానీ ఈమె తరచూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ సందడి సందడి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్ళిన కృతిశెట్టి కి ఊహించని షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. ఒక అభిమాని మాటలు షాక్ ఇచ్చాయి. మాల్ లో మాట్లాడుతుండగా.. ఫ్యాన్ ఒకరు మీరు నటించిన స్కంద చిత్రం బాగుందని అన్నారు. దాంతో కృతిశెట్టి షాక్ అయ్యింది. థ్యాంక్యూ అని చెబుతూనే.. అందులో నేను లేను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. పాపం అభిమానులు బేబమ్మను మరిచిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సదరు అభిమాని శ్రీ లీల అనుకొని కృతిశెట్టికి ఆ కామెంట్ చేశారు. బాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పై శ్రీ లీలా అభిమానులు, కృతి శెట్టి అభిమానులు పోటాపోటీగా కామెంట్స్ చేస్తున్నారు.

అక్కడ అవకాశాలు అందుకుంటున్న బేబమ్మ..

ఇకపోతే శ్రీలీలా విషయానికి వస్తే ఆమె ఇండస్ట్రీలో శ్రీలీలా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. వరుస చిత్రాలతో దుమ్ములేపుతోంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. శ్రీలీలా దెబ్బకు బేబమ్మ క్రేజ్ తగ్గిపోయింది. ఏదేమైనా కృతిశెట్టి మాత్రం కోలీవుడ్ ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటోంది. కాగా కృతిశెట్టికి తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. ఇటీవలే ప్రదీప్ రంగనాథన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది కృతిశెట్టి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago