Movie News

Taapsee: వీసా నిబంధనలపై అలాంటి కామెంట్స్ చేసిన తాప్సీ.. చాలా దురదృష్టకరం అంటూ!

Taapsee: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది తాప్సీ. కాగా ఈమె తెలుగులో దరువు, మొగుడు, మిషన్ ఇంపాజిబుల్, షాడో నీవెవరో,ఆనందో బ్రహ్మ, ఆడు కలం,వస్తాడు నా రాజు, ఝుమ్మంది నాదం, సాహసం,నీడ,గుండెల్లో గోదారి లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తమిళం హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన కి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాప్సీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి వీసా నిబంధనల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. వీసా కోసం ప్రస్తుతం అమలుచేస్తోన్న నిబంధనలు కఠినంగా ఉన్నాయి. సమాజంలోని పేదవాళ్లకు అవి వర్తించడం దురదృష్టకరం. కావాల్సినంత బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూపించి ధనవంతులు సులభంగా వీసా పొందుతారు.

బ్యాంకు బాలన్స్ తక్కువ ఉండడంతో అలా..

తక్కువ ఆదాయం ఉన్నవారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆ కారణంతోనే మా చిత్రబృందం లోని చాలామంది ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ తక్కువ ఉన్నందున డంకీ యూనిట్‌లోని కొంతమంది యూకే వీసా పొందలేకపోయారు అని తాప్సీ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఆమె మాటలను ఏకీభవిస్తూ అవును మేడం చాలా సూపర్ గా చెప్పారు సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తాప్సీ పన్ను సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా కోసం తాప్సీ వర్క్‌ చేస్తున్నారు. హసీన్‌ దిల్‌రుబా సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. జయ్‌ప్రద్‌ దేశాయ్‌ దర్శకత్వంలో విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago