మీకు షుగర్ ఉందా.. అయితే అది ఏ టైప్?

ప్రస్తుతం మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సమస్యలలో షుగర్ వ్యాధి సమస్య ఒకటి. చాలామంది తాము మధుమేహంతో బాధపడుతున్నామని చెబుతుంటారు కానీ, అది ఏ విధమైనటువంటి షుగర్ అనే విషయం చాలా మందికి తెలియదు. షుగర్ లో రెండు రకాలు ఉంటాయి. అది టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అనే రెండు రకాలు ఉంటాయి.

సాధారణంగా టైప్ 1 డయాబెటిస్ ఎక్కువగా చిన్నపిల్లలు యుక్తవయసు వారిలో వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటిస్ అనేది 45 సంవత్సరాల పైబడిన వారిలో వస్తుంది.అయితే తాజా అధ్యయనాల ప్రకారం ఈ విధమైనటువంటి రెండు రకాల షుగర్ వ్యాధితో బాధపడే వారికి చికిత్స విధానం కూడా వేరే ఉంటుందని నిపుణులు తెలియజేశారు.

షుగర్ వ్యాధితో బాధపడే వారు టైప్ 1, టైప్2 డయాబెటిస్ తో బాధపడుతున్నరా అనే విషయాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవచ్చని ఈ అధ్యయనంలో నిరూపితమైనది. ఈ క్రమంలోనే టైప్ వన్ డయాబెటిస్ తో బాధపడేవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. రోగనిరోధక శక్తిలోని కొన్ని కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల పై దాడి చేయటం వల్ల వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఈ విధంగా ఇన్సులిన్ ఉత్పత్తి కాని వారు టైప్ 1 డయాబెటిస్ బారిన పడతారు.ఇది ఎక్కువగా చిన్నపిల్లలు యుక్తవయసు వారిలో అధికంగా వస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగినప్పటికీ, ఆ ఇన్సులిన్ సరైన క్రమంలో శరీరం ఉపయోగించకపోవడం వల్ల వారు టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు. టైప్2 డయాబెటిస్ అధికంగా 45 సంవత్సరాలు పైబడిన వారిలో వస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా టైప్ 2 డయాబెటిస్ రావడం గమనార్హం. అదేవిధంగా మన జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా వస్తోంది.