ఆగస్టు15 రోజున ఖచ్చితంగా బుల్లితెర లో ఈ తెలుగు సినిమానే వస్తుంది.. ఎందుకో మీకు తెలుసా.?

విభిన్నమైన సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు ఈ దర్శకుడు. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని సృజనాత్మక కథలతో తీస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. గులాబీ, నిన్నే పెళ్లాడతా లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత తనతో సినిమా చేయడానికి ఎంతో మంది హీరోలు ఎదురుచూస్తున్న సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు.

ప్రిన్స్ మహేష్ బాబును వెండితెరకు పరిచయం చేసే అవకాశాన్ని వదులుకొని ఒక సృజనాత్మకమైన చిత్రాన్ని రూపొందించడానికి కృష్ణవంశీ ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కృష్ణవంశీ ఒక దేశభక్తి కథ అనుకున్నారు. ఆ సినిమాని ముగ్గురు స్టార్ హీరోలతో చేద్దామనుకున్నారు. కానీ అలాంటి మల్టీస్టారర్ మూవీకి వారు ఒప్పుకుంటారా అనే సందేహం వచ్చింది. ఆ క్రమంలో మిడిల్ రేంజ్ హీరోలను తీసుకుందామని అనుకున్నారు. అలా శ్రీకాంత్ రవితేజ ప్రకాష్ రాజ్ లాంటి వారిని ఈ చిత్రంలోకి తీసుకోవడం జరిగింది.

అయితే ఖడ్గం సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తారు. ముందుగా ఆయనకు బదులుగా నాగార్జున, వెంకటేష్ లను అనుకున్నారు. కానీ వారి బిజీ షెడ్యూల్ వలన ఈ సినిమాలో నటించ లేకపోయారు. అప్పటికీ కుటుంబ, ప్రేమ తరహా చిత్రాలను చేస్తున్న హీరో శ్రీకాంత్ ఇలాంటి డిప్రెషన్ లవర్ గా అలాగే యాంగ్రీ పోలీస్ మ్యాన్ గా నటించగలరా అనే సందేహం నిర్మాత మధు మురళికి వచ్చింది. కానీ కృష్ణవంశీ శ్రీకాంత్ పై పూర్తి నమ్మకంతో ఆయనకు పోలీస్ పాత్ర ఇవ్వడం జరిగింది.

ఖడ్గం సినిమా షూటింగ్ లో భాగంగా కృష్ణవంశీ, కెమెరామెన్ భూపతి హెలికాప్టర్ లో చార్మినార్ ప్రాంతాన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా 2002 నవంబర్ 29న అన్ సీజన్లో విడుదలయింది. ఇందులో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఒక వర్గం ప్రజలు ఆందోళన చేయగా కృష్ణవంశీ ఇందులోని కొన్ని దృశ్యాలను తీసివేశారు. ఇలాంటి దేశభక్తి సినిమా ఆగస్టు 15న లేదా జనవరి 26న బుల్లితెరలో ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంది.