చనిపోయే ముందు ఏడు సంవత్సరాలు మంచానికే పరిమితమైన సంగీత దర్శకుడు…!

తెలుగు సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి తెలుగు ప్రతిష్టను అమాంతం పెంచిన సంగీత దర్శకులలో సాలూరు రాజేశ్వరరావు ఒకరు. సాధారణంగా ఒక సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు అంటే చాలామంది సంగీత దర్శకులు అనుకరణలు అనుసరణలు చేస్తూ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే రాజేశ్వరరావు మాత్రం ఎలాంటి అనుకరణలు లేకుండా తనదైన శైలిలో సంగీతం సమకూరుస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు.

1940 సంవత్సరంలో రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన “ఇల్లాలు” అనే చిత్రంలోని పాటలు అప్పట్లో దక్షిణాది రాష్ట్రాలలో మార్మోగి పోయాయి. ఆ తరువాత కురుక్షేత్రం, మిస్సమ్మ, రంగుల రాట్నం, పూలరంగడు, మనుషులంతా ఒక్కటే వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతాన్ని అందించిన రాజేశ్వరరావు చివరిగా కృష్ణంరాజు నటించిన “తాండ్ర పాపారాయుడు” అనే సినిమాకు నాలుగు పద్యాలు, మూడు పాటలకు స్వరాలు సమకూర్చి వాటిని ఎస్పీ బాలసుబ్రమణ్యం పి.సుశీల ఏసుదాసు వంటి వారితో పాడించి రికార్డు చేశారు. అయితే తన సినీ ఇండస్ట్రీలో ఇదే ఆఖరి చిత్రం.

ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సమయంలో ఉన్నఫలంగా ఎక్కిళ్ళు వచ్చాయి. ఈ విధంగా ఎక్కిలు రావడంతో రాజేశ్వరరావు శరీరంలో ఒకవైపు పక్షవాతం వచ్చి పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైన రాజేశ్వరరావుకు ఐదుగురు కోడళ్ళు, ఐదుగురు కొడుకులు పసిబిడ్డను చూసినట్టు చూసుకున్నారు. ఈ విధంగా మంచానికే పరిమితమైన ఏడు సంవత్సరాల తర్వాత రాజేశ్వరరావు మరణించారు.తన మరణం తర్వాత సంగీత వారసత్వాన్ని తమ కొడుకులు వాసుదేవరావు, కోటి రావు పుచ్చుకున్నారు.