పాక్ కు చుక్కలు చూపించిన సైనికుడు.. మహావీర చక్ర అందుకున్న అతడు ఎవరు..?

పదిహేడు సంత్సరాల వయస్సులో అతడు భారతీయ ఆర్మీలో చేరాడు. 1962 చైనా యుద్ధంలో, 1965 పాక్‌తో జరిగిన యుద్ధంలో అతడి ధైర్య సాహసాలు అమోఘం. ఇలా భారత్ కోసం ఎన్నో యుద్దాలు చేసి 1984 వరకు మాతృభూమికి సేవలందించిన వీర కెరటం పేరు చెవాంగ్‌ రిన్‌చెన్‌. ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలోని లద్దాఖ్‌లో జన్మించిన రిన్‌చెన్‌ పేరు చెబితేనే పాక్‌ వణికిపోయేది. అతడి వ్యూహాలు శత్రువులను మట్టికరిపించేంత ఉంటాయి.

1947-48 పాక్‌ యుద్ధంలో పాక్ దళాలు లద్దాఖ్ వైపు వస్తుంటే.. పసిగట్టిన కెప్టెన్‌ ప్రీతిచంద్‌ నేతృత్వంలో రిన్‌చెన్‌తో పాటు మరి కొందరు సైనికులు ముందుగానే లద్దాఖ్‌ చేరేందుకు వ్యూహం రచించారు. అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. అయినా అతడు ఏ మాత్రం అధైర్యపడలేదు. ఏ మాత్రం అక్కడ అజాగ్రత్తగా ఉన్నా చనిపోవడం ఖాయం.

జాగ్రత్తగా వాళ్లు లద్దాఖ్ వైపు పయనించారు. ఈ విషయాన్ని పసిగట్టిన పాక్ సైన్యం ఆలోచనను విరమించుకున్నాయి. ఆ సమయంలో మన సైనికులు అక్కడికి చేరకుంటే.. ఆ ప్రాంతం పాక్‌ స్వాధీనమైవుండేది. ఇలా అతడు ధైర్య సాహసాలను చూపిస్తూ.. పాక్ కు చుక్కలు చూపించాడు. 1971 లో కూడా భంగ్లా విముక్తికి జరిగిన పోరాటంలో ఆయన సాహసం పోరాటానికి నిదర్శనంగా నిలుస్తుంది.

రిన్‌చెన్‌ పెద్దగా చదువుకోలేదు. కానీ అతడు చేసిన పోరాటం మూలంగానే లద్దాఖ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రిన్‌చెన్‌ను భారత ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది. అంత చిన్న వయస్సులో చేరి మహావీర చక్ర అవార్డు అందుకున్న అతడి ధైర్య సాహసాలను స్వాతంత్ర్య దినోత్సవం రోజున సోషల్ మీడియాలో నెటిజన్లు స్మరించుకుంటున్నారు.