ప్రపంచంలో జనాభా అధికంగా గల దేశం చైనా. తర్వాత స్థానంలో మన భారతదేశం ఉంది. అయితే చైనాలో అక్కడి శాస్త్రవేత్తలు రెండు డైనోసార్ల నమూనాలను కనుగొన్నారు. ఇవి రెండు దాదాపు ఓ పెద్ద నీటి తిమింగలం అంత సైజులో ఉన్నాయని వారు తెలిపారు. 130 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. మొదటిది 65 అడుగుల పొడవు.. రెండోది 55 అడుగుల పొడవుతో ఉన్నాయని భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
వీటిని వాయవ్య చైనాలోని కనుకొన్నట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. వీటి యొక్క పేర్లను శాస్త్రవేత్తలు సిలుటిటాన్ సినెన్సిస్ లేదా “సీలు’’, హమిటిటాన్ జిన్జియాంగెన్సిస్ లేదా హమీ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. శిలాజాలు జిన్జియాంగ్‌లో కనుగొన్నారు. అందుకే అలా పేరు పెట్టారు. చైనాలో సీలు అంటే సిల్క్ రోడ్ అని అర్థం. హీమి అంటే కొనుకొన్న నగరాన్ని సూచిస్తుంది. ఇందులో ఒక డైనోసర్ మొక్కలను మాత్రమే తింటుందని తెలిపారు.
ఇవి ఆసియా, దక్షిణ అమెరికాలలో తిరిగేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఓ ఇంట్లో పెద్ద సంఖ్యలో ఓ ఇంట్లో డైనోసార్ల గుడ్లు దొరికాయి. అధికారులకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి పరిశోధనలు చేశారు. అక్కడ దాదాపు 231 గుడ్లు ఒక డైనోసార్ అస్థిపంజరం దొరికింది. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్విస్తున్నాడు. తవ్వకాలు జరుపుతుండగా శిథిలావస్థలో ఉన్న 231 డైనోసార్ గుడ్లతో పాటు అస్తిపంజరం బయటపడింది.
అయితే ఇంటి యజమాని వారికి ప్రభుత్వం అప్పగించకుండా దాచిపెట్టుకున్నారని అధికారులు చెప్పారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటిదే ఇప్పుడు మళ్లీ వాటి అవశేషాలు దొరికాయి. ఇలా డైనోసర్ల చరిత్రను అక్కడి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…