Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వకు ఎంత ఇచ్చారో తెలుసా?

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ద్వారా ఇద్దరు జానపద కళాకారులకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ సాంగ్ ద్వారా 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్యకు మంచి గుర్తింపు రావడమే కాకుండా ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది.

Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

అలాగే ఈ సినిమాలో అడవి తల్లిమాట అనే పాట కోసం మరో జానపద కళాకారిణి దుర్గవ్వ సాహితి చాగంటితో కలిసి పాడిన ఈ పాట ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇలా ఈ పాట ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన సింగర్ దుర్గవ్వ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమెకు ఈ సినిమాలో పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయాలను వెల్లడించారు.

Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

ఈ సందర్భంగా ఈమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. ఈ పాటలు మంచి హిట్ కావడం చేత ఈ సినిమాలో పాటపాడే అవకాశం వచ్చిందని తెలియజేశారు. ఇలా ఈ సినిమాలో పాట పాడే అవకాశం దక్కించుకున్నానని ఈమె వెల్లడించారు.

ఐదారు నిమిషాల్లోనే పాట పూర్తి చేశాను….

ఇక ఈ సినిమాలో అడవి తల్లి మాట అనే పాటను కేవలం ఐదారు నిమిషాల్లో పూర్తి చేసి వెళ్లిపోయానని అయితే ఈ పాట పాడినందుకు నాకు పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించారని తెలియజేశారు. మిగతా డబ్బులు చిత్రబృందం తన కూతురి చేతికి అందించారని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.