Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విశాఖపట్నం వెళ్లారు. అయితే గతంలో తన గురించి ఓ వార్తాపత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడంతో ఆయన ఈ విషయం పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు స్వయంగా నారా లోకేష్ హాజరయ్యారు.
గురువారం ఈ విచారణకు హాజరైన లోకేష్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ గతంలో తను ప్రజాధనంతో 25 లక్షల విలువచేసే చిరుతిండ్లను తిన్నారని ప్రముఖ వార్తా పత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడమే కాకుండా మరో
మేగజీన్ కూడా ఇదే తరహా కథనాలను రా సాయి అని లోకేష్ తెలియజేశారు.
ఆ విషయం పై ఆధారాలతో సహా వాస్తవాలను తెలియజేయడంతో సదరు మేగజీన్ తనకు క్షమాపణలు చెప్పిందని తెలియజేశారు. అయితే మరొక పత్రికఇప్పటివరకు తన వివరణను ప్రచురించలేదని ఈ క్రమంలోనే ఆ పత్రికపై నారా లోకేష్ 75 కోట్ల పరువు నష్టం దావా వేసి నట్లు వెల్లడించారు.
ఇక ఈ కేసు గత కొన్ని నెలల నుంచి విచారణ జరుగుతోందని, ఈ కేసు విచారణ పూర్తి కాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసు మాత్రం ఈనెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రధాన న్యాయమూర్తి భావిస్తున్నారని లోకేష్ మీడియాకు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…