శంకరాభరణం రాజ్యలక్ష్మికి పెళ్లి ఎలా కుదిరిందో మీకు తెలుసా..?

నటి రాజ్యలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది రాజ్యలక్ష్మి. 1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ శంకరాభరణం సినిమాలో నాయిక కోసం వెతుకుతున్న సమయంలో ఆమె తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రంలోని శారద పాత్రకోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో నటించింది.

నాయికగా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం, జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి. మొదటి సనిమాతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె ‘శంక‌రాభ‌ర‌ణం’ను ఇంటిపేరుగా మార్చుకొని ‘శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి’గా పాపుల‌ర్ అయ్యారు.

ఈ సినిమా తర్వాత ఆమె వెంటనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్ తో నిప్పులాంటి నిజం సినిమాలో నటించారు. తర్వాత ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ అనే సినిమాలో బాలయ్యతో నటించారు. 1990 లో ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అయితే అక్కడ సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది.. కానీ నటనను మాత్రం వదల్లేదు. 1999లో ఆమె తమిళంలోనో ఓ సీరియల్ లో నటనకు ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ల‌భించింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు(రోహిత్, రాహుల్) జన్మించారు. చిన్నతనం కాబట్టి వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడానికి సమయం ఎక్కువగా కేటాయించేవారు.

వాళ్లు పెరిగి పెద్ద అయిన తర్వాత తిరిగి 2004 లో వీరు చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు, సీరియల్స్ లల్లో నటిగా కొనసాగించింది. అయితే ఆమె పెళ్లి అంత సింపుల్ గా జరగలేదు. ఓ రోజు తన కుటుంబంతో డిన్నర్ కు వెళ్లినప్పడు అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతడు సింగపూర్ లో ఉంటాడని ఆమె తెలుసుకున్నారు. తనకు సింగపూర్ లో షూటింగ్ ఉంటుందని అతడికి చెప్పగా.. మీరు వస్తే.. మమ్మల్ని మీట్ అవ్వండి అంటూ విసిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇలా ఆమె సింగపూర్ వెళ్లినప్పడు అతడిని కలవడం.. రాజ్యలక్ష్మి వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చడం జరిగిపోయాయి. ఇలా ఓ డిన్నర్ వద్ద పరిచయమైన వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.