కోతులు అనేవి అడవిలోనే కాదు.. ఊళ్లల్లో కూడా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దగ్గరకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతారు జనాలు. అయితే ఓ కోతి ఇంట్లోకి చొరబడిన పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసింది. అవును మీరు విన్నది నిజమే.. ఓ పెంపుడు కుక్క పిల్లను కోతి ఎత్తుకెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మలేషియాలోని ఓ ఇంట్లోకి కోతి వచ్చింది. అది ఆహార పదార్థాల కోసమే వచ్చిందని కుటుంబసభ్యులు అంతా కూడా భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో అది చిన్న పెంపుడు కుక్కపిల్లను చేతిలో పట్టుకొని అక్కడ నుంచి పరుగు తీసింది.
ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా.. తాజాగా ఆ వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌నకు గురైన కుక్క పిల్లను కాపాడేందుకు కుటుంబ సభ్యులు సహా స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించారు. కానీ అది మనిషి కాదు కదా.. అంత సింపుల్ గా తన చేతికి దొరికింది వదిలేయడానికి. ఇలా ఆ కోతి.. కుక్క పిల్లను వదిపెట్టలేదు. మూడు రోజుల పాటు తన వద్ద ఉంచుకుంటూ తిరుగుతూ ఉంది. చెట్లపైనే తిరుగుతూ.. అటు కుక్క తల్లిని, గ్రామస్తులను ముప్పు తిప్పలు పెట్టింది.
దాదాపు మూడు రోజుల తర్వాత ఆ కుక్కను దాని చెర నుంచి గ్రామస్తులు కాపాడగలిగారు. కుక్క పిల్ల కూడా సేఫ్‌గా ఉందని దాని యజమానులు తెలిపారు. ఆ కుక్క పిల్లను తన పిల్ల అనుకొని కోతి.. దానికి ఎలాంటి హాని కలిగించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కోతి కిడ్నాప్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…