Movie News

పూర్తిగా కోలుకున్న సాయి తేజ్.. అంతా ఆమె దయేనా..?

సెప్టెంబర్ 10వ తేదీ కేబుల్ బ్రిడ్జి దగ్గర ప్రమాదానికి గురైన మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు కుదుటపడుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం సాయి తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది. అయితే మెగా హీరో సురక్షితంగా బయట పడటానికి కారణం మెగా కోడలు ఉపాసన అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సాయి తేజ్ కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే రంగంలోకి దిగిన ఉపాసన అర్ధరాత్రి సమయంలో ప్రముఖ వైద్య నిపుణులు అందరిని ఆస్పత్రికి రప్పించి అతనికి చికిత్స అందేలా చేసింది. తన ఆరోగ్య విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా ప్రతి నిమిషం తనని కని పెట్టుకుంటూ తనకు మెరుగైన వైద్యసేవలు చేయాలని సూచించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.

ఇలా మెగా ఇంట కోడలిగా అడుగు పెట్టిన ఉపాసన ఎంతో సేవాగుణం కలదని మనందరికీ తెలిసిందే. ఈమెకు ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, ఏ మాత్రం హంగు ఆర్బాటాలు లేకుండా ఎంతో సింపుల్ గా ఉండటం అలవాటు చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ కి వైస్ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ తనలో ఎంతో సేవా గుణం ఉందని ఎంతో మందికి సహాయ సహకారాలను అందిస్తూ తనేంటో నిరూపించుకొని మరో మెట్టు ఎక్కి మెట్టినింటికి గౌరవం నిలబెడుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఓ వైపు సంబరాలు చేసుకుంటున్న అభిమానులు సాయి తేజ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఉపాసన అని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ఈ విషయంలో మాత్రమే కాకుండా, కరోనా బారిన పడ్డ మెగా కుటుంబ సభ్యులకి కూడా ఉపాసన అపోలో ఆస్పత్రిలో వైద్య చికిత్స అందించి అందరి చేత ప్రశంసలు పొందింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago