20 సంవత్సరాల తరువాత వచ్చే ఆల్జీమర్స్ వ్యాధిని ముందుగానే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసా?

అల్జీమర్స్ వ్యాధి అంటే అదేదో పెద్ద వ్యాధి అని భయపడకండి. కరెక్ట్ గా మన భాషలో మాట్లాడుకుంటే మతిమరుపు అంటారు. కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనినే చిత్త వైకల్యం అంటారు. మతిమరపు మనుషులకి సర్వ సాధారణం, కానీ ఈ వ్యాధి ప్రభావం ఉన్నవాళ్లు రోజు వారి కార్యకలాపాలు, ప్రదేశాలు, నిన్న మొన్న కలసిన వ్యక్తులను మరచిపోవడం వంటివి కూడా మరచిపోతారు.

మానవ మెదడులో వచ్చే వ్యాధులలో ఒకటైన అల్జీమర్స్ వ్యాధిని 20 సంవత్సరాల ముందే గుర్తించవచ్చు అని నిపుణులు అధ్యయనం చేశారు. అల్జీమర్స్ వ్యాధి 30 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులలో ప్రారంభం అవుతుంది. ఇది వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది.మన మెదడులో హైపర్ యాక్టివేషన్ సింప్టంస్ అల్జీమర్స్ వ్యాధికి సంకేతం అని కొన్ని రీసెర్చ్ లు చెప్తున్నాయి. మతిమరపు ఉన్నప్పటికీ అల్జీమర్స్ ఉన్నట్టు నిర్దారణ కానీ వారిలోని కొన్ని మెదడు భాగాలు హైపర్ ఆక్టివ్ లో ఉంటున్నాయి అని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కేనడలోని యూనివర్సిటీ ఆఫ్ డి మాoట్రియల్ పనిచేస్తున్న ఒక అధ్యయన శాస్త్రవేత్త సిల్వీ బెల్లేవిల్లే (Sylvie Belleville) గారు చెప్పిన ప్రకారము ఈ వ్యాధిని 20 నుండి 30 సంవత్సరాల ముందే మెదడు లోని మార్పులని బట్టి గుర్తించ వచ్చును అని చెప్పారు. మెదడులో చోటు చేసుకునే హైపర్ యాక్టివేషన్ సమస్యను ఈ వ్యాధికి ఫస్ట్ స్టేజ్ గా భావించవచ్చు అని తెలిపారు.ఈ అధ్యయనాన్ని అల్జీమర్స్ అండ్ డిమెన్షియా: డయాగ్నోసిస్, అసెస్మెంట్ అండ్ డిసీజ్ మానిటరింగ్ అనే జర్నల్ లో ప్రచురించారు. అధ్యయనం కోసం early identification of Alzheimer’s Disease Consortium డేటాను బేస్ చేసుకున్నారు. MRI స్కాన్ చేసిన తర్వాత మతిమరపు సమస్యలు బయటపడి, అల్జీమర్స్ వ్యాధి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎవరికి ఉందొ వారి మెదడు యాక్టివేషన్ కెపాసిటీ ని వీరు అధ్యయనం చేశారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిన్న వయసులో ప్రారంభం అయ్యే అల్జీమర్స్ రకం ఎక్కువగా జన్యుపరమైన ప్రభావంతో ఉంటుంది, ఇది అరుదుగా ఉటుంది. అయితే వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ రకం జన్యుపరమైన, లైఫ్ స్టైల్ ఆండ్ పర్యావరణ కారకాల మిశ్రమం కారణంగా ఉంటుంది.
కొన్ని జాగ్రత్తలు తేసుకోడం వల్ల అల్జీమర్స్ ని త్వరగా గుర్తించి సమస్యకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.