బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అందగాడు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే తాను సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్ననాటి రోజులను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఇటీవల రణ్ బీర్ సింగ్ ‘‘రాజ్ కపూర్: ద మాస్టర్ ఎట్ వర్క్ ’’ పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంజయ్ లీలా బన్సాలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ ఈవెంట్ లో ముందుగా రణ్ ధీర్ కపూర్ మాట్లాడుతూ…నేటి తరం డైరెక్టర్లు ఎక్కువగా కమర్షియల్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని… రాజ్ కపూర్ శకం నాటి సినిమాలు ముగిశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. బాబీ సినిమాలో నటించినందుకు కేవలం పేయింటింగ్ మాత్రమే ఇచ్చారని గుర్తు చేశాడు. కాగా ఈ వ్యాఖ్యలపై రణ్ బీర్ కపూర్ పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించారు. దర్శకులు పూర్తిగా కమర్షియల్ సినిమాలపైనే ఎక్కువగా మొగ్గు చూపించడం లేదని.. ఈ వ్యాఖ్యలను నేను నమ్మనని అన్నాడు.
సంజయ్ లీలా బన్సాలీ కమిట్ మెంట్ గురించి రణ్ బీర్ కపూర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సంజయ్ లీలా బన్సాలీ బ్లాక్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానిని.. ఆ సమయంలో అనేక గంటలు మోకాలుపై కూర్చునే వాడినని గుర్తు చేసుకున్నాడు. ఓక్కోసారి బన్సాలీకి కోపం వచ్చి తిట్టేవారని.. కోపం ఎక్కువైతే కొట్టేవాడని రణ్ బీర్ కపూర్ అన్నారు.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవడంతో.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా తయారయ్యానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ లవర్ బాయ్.. అలియాభట్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. త్వరలో వివాహం కూడా చేసుకునేందుకు సిద్దమవుతోంది ఈజంట. మరోవైపు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ బ్రహ్మస్త్రలో నటిస్తున్నాడు రణ్ బీర్ సింగ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…