UdayaBhanu: రీ ఎంట్రీతో ఉదయభాను రచ్చ రచ్చ..! సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం అయ్యేనా..?

UdayaBhanu: రీ ఎంట్రీతో ఉదయభాను రచ్చ రచ్చ..! సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం అయ్యేనా..?

UdayaBhanu: టాలీవుడ్ లో లేడీ యాంకర్ గా ఎక్కువగా పాపులర్ అయినది సుమ. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసినా.. సుమ సందడి కనిపిస్తుంటుంది. ఇలా టాలీవుడ్ లో లేడి యాంకర్స్ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. వేదికపై వాళ్ల మాటలతోనే ఆ ఫంక్షన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అనసూయ – రష్మీ లాంటి యాంకర్స్ దెబ్బకి కొంతమంది క్రేజ్ తగ్గుతూ వస్తోంది.

UdayaBhanu: రీ ఎంట్రీతో ఉదయభాను రచ్చ రచ్చ..! సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం అయ్యేనా..?
UdayaBhanu: రీ ఎంట్రీతో ఉదయభాను రచ్చ రచ్చ..! సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం అయ్యేనా..?

కానీ సుమని మాత్రం వాళ్ళు అంతగా బీట్ చేయలేకపోతున్నారు. సుమ మాట్లాడే మాటలు చాలా సాధరణంగా ఉంటాయి. ఎలాంటి గ్లామర్ డోస్ లేకున్నా.. కూర్చున్న వారిని ఇట్టనే కట్టి పడేస్తుంది. ఇలా సుమా యాంకరింగ్లో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఎంత మంది హాట్ యాంకర్స్ వస్తున్నా ఒకప్పటి ఉదయ భానును రేంజ్ లో మాత్రం క్రేజ్ అందుకోలేదనే చెప్పాలి. సుమ కంటే ముందు నుంచి కూడా ఉదయభాను తన రియాల్టీ షోలను చేసుకుంటూ.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ.. బిజీబిజీగా కనిపించేది.

Dhanush Telugu Movie: తెలుగులో ధనుష్ మొదటి సినిమా ఇదే..! మోషన్ పోస్టర్ విడుదల..!

అవార్డ్స్ ప్రోగ్రాంలలో హోస్టింగ్ చేసుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఢీ డ్యాన్స్ షో అయితే ఆమె యాంకరింగ్ ఓ పీక్ స్టేజ్ కి వెళ్లిందనే చెప్పాలి. ఆమె తర్వాతనే సుమ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పెళ్లి తరువాత హ్యాపీగా కుటుంబ సభ్యులతో పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె యాంకరింగ్ కి దాదాపు గుడ్ బాయ్ చెప్పేసిందని అంతా అనుకున్నారు. మధ్యలో కాస్త మెరిసినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు.

UdayaBhanu: రీ ఎంట్రీతో ఉదయభాను రచ్చ రచ్చ..! సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం అయ్యేనా..?

ఇక మళ్లీ పూర్వ వైభవం కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పుష్ప సక్సెస్ మీట్ లో ఉదయభాను మెరిసింది. తనదైన శైలిలో యాంకరింగ్ చేసి.. అందరినీ మెప్పించింది. ఏకంగా అల్లు అర్జున్ ఆమెను కొనియాడారు. ఉదయభాను గారు మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను.. గ్యాప్ ఇచ్చినా.. యాంకరింగ్ బాగా చేస్తున్నారంటూ పొగిడాడు. ఇలా మళ్లీ ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ ట్రాక్ లోకి రావాలిని ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేశారు