Hyper Aadi: ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి అదే కారణమా.. దోషం పోవాలంటే అలా చేయాలా?

Hyper Aadi: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగారు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేశారు ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెరపై కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా హైపర్ ఆది ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికే సింగిల్ గానే ఉంటున్నారు. హైపర్ ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎక్కడికి వెళ్లిన తన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది తనకు ఎందుకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. పెళ్లి బట్టలలో ఈ కార్యక్రమంలో కనిపించినటువంటి ఈయన తాగుబోతు రమేష్ ద్వారా తనకు పెళ్లి కాకపోవడానికి కారణాలను తెలియజేశారు ఇప్పటివరకు తనకు పెళ్లి కాకపోవడానికి కారణం జాతకంలో దోషమేనని తెలిపారు. తన జాతక దోష పరిహారం కోసం తనకు ముందుగా ముసలామెతో పెళ్లి జరిగితే పెళ్లి జరుగుతుంది అంటూ రమేష్ తెలిపారు.

జాతకంలో దోషమే కారణమా..
ఇలా జాతకంలో దోషం తొలగిపోవడానికి వృద్ధురాలితో పెళ్లి చేయాలని చెప్పారు. అయితే తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు అంటూ హైపర్ ఆది తెలిపారు. ఇలా తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రాకపోవడంతోనే జాతకంలో దోషం అలాగే ఉండిపోయిందని అందుకే నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు అంటూ హైపర్ ఆది తెలిపారు. అయితే ఇది నిజం కాదని కేవలం స్కిట్ లో భాగమని తెలుస్తుంది.