Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ప్రస్తుత తన కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఒకవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా తనకు ఏమాత్రం సమయం దొరికిన అభిమానులతో సరదాగా గడుపుతూ ఉంటారు.
ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేస్తూ తాను యానిమల్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయానని తెలిపారు. ఈ సినిమా విడుదలైన వెంటనే తనకు ఇతర సినిమా షూటింగ్ పనులు ఉండటం వల్ల ఈ సినిమా సక్సెస్ అనుభవించలేకపోయాను అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈమె పోస్ట్ పై గత వారం కిందట ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ రష్మిక నువ్వు నాకు హాయ్ చెప్పకపోతే నేను అన్నం తిననని నిరాహార దీక్ష చేస్తానని కామెంట్ చేశారు అయినా కూడా రష్మిక స్పందించలేదు.
తాజాగా ఈమె మిర్రర్ సెల్ఫీ దిగి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదే నెటిజన్ ఈ పోస్టుకు కామెంట్ చేస్తూ నీకు మిర్రర్ సెల్ఫీ దిగే టైం ఉంది కానీ నా మెసేజ్ కు రిప్లై చెయ్ టైం లేదా అంటూ ఏడుస్తూ ఉన్నటువంటి ఎమోజీలను షేర్ చేశారు దీనితో రష్మిక ఈ కామెంట్ పై స్పందించారు.
సెల్ఫీ దిగే టైం ఉంది..
గ్యాప్ లో అంట.. వర్క్ గ్యాప్ లో ఈ సెల్ఫీ తీసుకున్నాన్ రా, సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండేఅంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంతేకాకుండా మీరు ఇలా రా అని పిలుస్తూ ఉంటే చాలా బాగుందని రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ అంటూ అభిమాని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…