ఆట ఫేమ్ భరత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?

బుల్లితెరపై ఓంకార్ ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఓంకార్ సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన గుర్తింపు ఓంకార్ కి ఉంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఆట అనే కార్యక్రమాన్ని కూడా ఓంకార్ చేసేవారు.ఆట కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఈ క్రమంలోనే ఆట కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కొరియోగ్రాఫర్ భరత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భరత్ చూడటానికి కొద్దిగా లావుగా ఉన్నప్పటికీ ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవారు. ఆట కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న భరత్ తనకు మంచి భవిష్యత్తు ఏర్పడేలోగా ఈ లోకం వదిలి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

అప్పుడప్పుడే కెరీర్ గాడిలో పడుతున్న క్రమంలో భరత్ 2015 వ సంవత్సరంలో హైదరాబాదులోని మోతీ నగర్ లో తన సొంత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే భరత్ చనిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు తెలియకపోయినప్పటికీ భరత్ మృతి మాత్రం అందరినీ కృంగ తీసిందని చెప్పవచ్చు.

భరత్ ఈ విధంగా చనిపోవడానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో ఎంతో మానసికంగా క్రుంగిపోయిన భరత్ ఈ విధమైనటువంటి దారుణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. 2015 సంవత్సరంలో నిశ్చితార్థం జరుపుకున్న భరత్ 2016 ఫిబ్రవరిలో పెళ్లి కూడా నిర్ణయించారు.ఈ క్రమంలోనే భరత్ చనిపోయేముందు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలోనే భరత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.