Sunny Leone: సన్నీలియోన్ పాటను నిషేధించాలి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

Sunny Leone: సన్నీలియోన్ పాటను నిషేధించాలి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ అంటే తెలియని వారుండరు. ఆమె ఇటీవల నటించిన ఓ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె తాజా పాట ‘మధుబన్’ పాటలో.. బోల్డ్ దుస్తులలో ఆమె కనిపించగా.. మధురకు చెందిన పూజారులు సన్నీ లియోన్ పై మండిపడుతున్నారు.

Sunny Leone: సన్నీలియోన్ పాటను నిషేధించాలి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!
Sunny Leone: సన్నీలియోన్ పాటను నిషేధించాలి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

తాజా వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ నటి “మధుబన్ మే రాధిక నాచే” పాటలో “అశ్లీల” నృత్యం చేయడం ద్వారా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. అంతే కాకుండా నెటిజన్లు సన్నీలియోన్ పై మండిపడుతున్నారు.

Sunny Leone: సన్నీలియోన్ పాటను నిషేధించాలి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

సోషల్ మీడియాలో సన్నీలియోన్ ను బాగా ట్రోల్ చేస్తున్నారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదంటూ సన్నీలియోన్ పై మండిపడుతున్నారు. ఈ పాటను నిజానికి 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. ప్రభుత్వం నటిపై చర్యలు తీసుకోకపోతే తాము కోర్టుకు వెళ్తాం అని బృందాబన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..

అంతే కాదు ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే.. ఆమెను భారతదేశంలో ఉండనివ్వమని హెచ్చరించారు. అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా సన్నీ డ్యాన్స్ వీడియోను నిషేధించాలన్నారు. “అవమానకరమైన రీతిలో” పాటను ప్రదర్శించడం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. షరీబ్ తోషి ఈ పాటను పాడగా.. దీనికి గణేష్ ఆచార్య డ్యాన్స్ మాస్టార్ గా పనిచేశాడు.