RRR Movie Release: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా..కారణం ఏంటో తెలుసా..!
RRR Movie Release: ఇండియన్ ఫిలీం ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. దక్షిణాది భాషలు, హిందీతో పాటు మొత్తం 14 భాషల్లో మూవీ రిలీజ్ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీ స్థాయితో సినిమాను తెరకెక్కించారు.
చారిత్రత్మక కథాంశంతో సినిమా నిర్మించారు. ఇందులో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కోమురంభీంగా నటిస్తున్నారు. మరో మఖ్య పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గన్ కూడా నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడీగా ఓలీవియా మోరిస్ నటిస్తున్నారు.
భారీ తారాగణంలో నటిస్తుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తం జనవరి 7న సినిమా విడులవ్వనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే … ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే అవుతుంది. గతంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ భారీగా నష్టపోయింది. థియేటర్లకు అనుమతి లేకపోవడంతో చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి.
అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ దేశంలో కల్లోలం పుట్టిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. జనవరిలో కేసుల సంఖ్య మరింత పెరగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమాను అనుకున్న తేదీ జనవరి 7న విడుదల చేస్తే కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని అంచానా వేస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలు సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…