Featured

Samantha Web Series: మరో వెబ్ సిరీస్ కు సమంత సై.. మళ్లీ ఆ దర్శకులతోనే..!

Samantha Web Series: సమంత ఇంతకుముందు అమెజాన్ ప్రైమ్ లో పాపులర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ లో పనిచేసి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతోందట ఈ బ్యూటీ. అది కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులతోనే కావడం విశేషం. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించనున్నారు.

Samantha Web Series: మరో వెబ్ సిరీస్ కు సమంత సై.. మళ్లీ ఆ దర్శకులతోనే..!

ఇందులో హీరోగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ను ఎంపిక చేసుకున్నారు. మొదటి సారి ఇతడు OTT ప్లాట్‌ఫారమ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వరుణ్ ధావన్ అమెజాన్ ప్రైమ్ లో రాబోయే వెబ్ సిరీస్‌పై సంతకం కూడా చేశాడట. ఆమె వరుణ్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

Samantha Web Series: మరో వెబ్ సిరీస్ కు సమంత సై.. మళ్లీ ఆ దర్శకులతోనే..!

త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక తాజాగా ఈ సిరీస్ లో చాలా యాక్షన్ సన్ని వేశాలు ఉన్నాయట. ఇందుకోసం వరుణ్, సమంతలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది యాక్షన్‌తో కూడిన సిరీస్ కాబట్టి నటీనటులు చాలా కష్టపడాల్సి ఉంటుందట. దీనికి సంబంధించి షూటింగ్ 2022లో ప్రారంభమవుతుంది.

బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా:

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికా వెర్షన్‌లో నటిస్తోంది. ఇందులో ప్రియాంకతో పాటు రిచర్డ్ మాడన్ కూడా కనిపించనున్నారు. వరుణ్ విషయానికి వస్తే.. ‘జగ్ జగ్ జియో,’ ‘ఎక్కిస్,’ ‘రణభూమి,’ ‘అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్,’ మరియు ‘భేదియా’ వంటి చిత్రాలలో కనిపించబోతున్నాడు. మరోవైపు సమంత అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న నటించిన పుష్ప చిత్రంలో తీసిన ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తాజా వెబ్ సిరీస్ కు ఆమె ఒప్పుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago