మీరు బాడీ స్ప్రే వాడుతున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. !!

ఈ కాలంలో చాలా మంది ఎక్కువగా బాడీ స్ప్రే లేదా పెర్ఫ్యూమ్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. బయటకు ఎక్కడకు వెళ్లాలన్నా, పార్టీ లేదంటే ఫంక్షన్ కు గాను వెళ్లాలంటే ఎక్కువగా బాడీ స్ప్రే లను వాడుతున్నారు.అలాగే టీవీ లో సైతం కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ వినియోగాన్ని పెంచడానికి రకరకాల యాడ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఇదంతా నిజం అని నమ్మి చాలామంది బాడీ స్ప్రే లేదా పెర్ఫ్యూమ్ వాడడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.కానీ అది ఒక అందమైన అబద్ధం.అసలు నిజం ఏటంటే పెర్ఫ్యూమ్స్, బాడి స్ప్రే వాడటం అనారోగ్యకరం. అసలు పెర్ఫ్యూమ్, బాడి స్ప్రే వలన కలిగే నష్టాల గురించి తెలుసుకోండి.. !!

ఎక్కువగా ఈ డియోడ్రెంట్స్, పెర్ఫ్యూమ్ లను అండర్ ఆర్మ్స్ లో కొట్టడం చూస్తుంటాం.అయితే ఆడవారిలో ఇది వక్షోజాలకి దగ్గరిగా ఉండే ప్రాంతం. కాబట్టి ఆడవాళ్లు అలా స్ప్రే చేసుకున్నప్పుడు ఆ ప్రభావం బ్రెస్ట్ టిష్యూలపై పడుతుంది. ఆ విధంగా ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. అలాగే వక్షోజాలకు సంబందించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ బాడి స్ప్రేల వలన బట్టలకి మరకలు కూడా పడతాయి.

మాములుగా మానం వాడే బాడి స్ప్రేలో ఎక్కువగా ఎథనాల్ ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచకుండా పొడిగా మార్చుతుంది..అలాగే పెర్ఫ్యూమ్స్ ని తయారుచేయడానికి వాటిలో రకరకాల కెమికల్స్ ను కలుపుతారు.. అవి ఎక్కువగా మన బాడీ మీద స్ప్రే చేయడం వలన చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. వీటి తయారిలో ట్రైక్లోసన్ అనే పెస్టిసైడ్ కూడా ఉపయోగిస్తారు.ఇది చర్మ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అలాగే ఈ బాడి స్ప్రేలలో పరాబెన్స్, పథలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిని చిన్నవయసులో ఉన్న ఆడపిల్లలు వాడితే త్వరగా రజస్వల అయ్యే అవకాశం ఉంటుందట.. అంతేకాదు గర్భిణీ సమయంలో పెర్ఫ్యూమ్స్ బాటిల్స్ ను చాలా వరకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే అది పుట్టే బిడ్డకే ప్రమాదం. బిడ్డ ఏదో ఒక లోపంతో పుట్టే ప్రమాదం ఉంటుంది. .