Featured

బోలెడంత ట్యాలెంట్ ఉన్న స్టార్ హీరోయిన్ కాలేకపోతున్న నటీమణులు వీరే..!

హీరోయిన్ అవ్వాలంటే మొదటగా ఏమి క్వాలిఫికేషన్ ఉండాలంటే మొదట అదృష్టం ఉండాలి. ఆ తర్వాత అందం ఉండాలి. అలాగే ఎటువంటి బట్టలు వేసుకోవటానికి అయినాగాని వెనుకాడకూడదు. అలాగే అందంగా, చూడడానికి మెచ్చే లాగా ఉండాలి. వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే.. మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి. అందం ఒక్కటే ఉంటే సరిపోదు అందంతో పాటు, హావభావాలు వ్యక్తపరిచేలా మంచి అభినయం కుడా ఉండాలి. అయితే ఇవన్నీ ఉన్నాగాని కొందరు హీరోయిన్స్ మాత్రం చివరాకరికి బి గ్రేడ్ హీరోయిన్స్ గానే ఉంటున్నారు. వాళ్ళకి ఎంతో భవిష్యత్ ఉన్నాగాని వాళ్ల జీవితాలు అలాగే మిగిలిపోతున్నాయి.

ఎంత అందం ఉన్నా కానీ, ఎంత టాలెంట్ ఉన్నా కానీ వాళ్లని సోలో హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఇవ్వలేకపోతున్నారు. పెద్ద హీరోలు అందరు వాళ్ళ సినిమాల్లో అన్ని సెకండ్ హీరోయిన్ పాత్రలో వీళ్లకు ఇస్తున్నారు. లేదంటే వాళ్ళని ఒక ఇంపార్టెంట్ రోల్ కి పరిమితం చేస్తున్నారు. దీంతో ఎటూ కాకుండా పోతుంది వాళ్ళ జీవితం. అలాగని చిన్న సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుదామా అనుకుంటే, చిన్న సినిమాలు చేస్తే చీప్ అయిపోతాం అన్న ఉద్దేశంలో ఉంటున్నారు. ఇలాంటి హీరోయిన్స్ జీవితాలు ఎటూ కాకుండా అయిపోతున్నాయి. అందం, అభినయము అన్నీ ఉన్నా కానీ పెద్ద సినిమాల్లో నటించలేకపోవడం వల్ల కేవలం బి గ్రేడ్ సినిమాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆ హీరోయిన్స్ ఎవరో ఓ సారి చూద్దాం.

మొదటగా క్యాథరిన్ :

అచ్చం బొమ్మ లాగా ఉంటుంది ఈ హీరోయిన్. అందంతో పాటు మంచి టాలెంటు కుడా ఉంది. అయితే అంత టాలెంట్ ఉన్నాగాని అన్ని సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ మాత్రమే చేసింది. కొన్ని కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది.

నిత్యామీనన్:

ఈమె ఒక నేచురల్ అందానికి నిదర్శనం. కానీ ఈ నటి యొక్క మెయిన్ ప్రాబ్లెమ్ ఏంటంటే హైట్ తక్కువగా ఉండడం. అందుకనే మంచి పేరు ఉన్నాగాని ఈ హీరోయిన్ తో కొత్త హీరోలు జోడి కట్టలేకపోతున్నారు. స్టార్ హీరోయిన్ అనే హోదా ఉన్నపటికీ మెయిన్ రోల్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ రావడం లేదు. అయితే, ఈవిడ అభిమానులు మాత్రం అంతగా బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏ సినిమా చేసినా గాని దానికి తగ్గట్టుగా స్టార్ హీరోయిన్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంటే సినిమాకు తగ్గట్టుగా తన దైన శైలిలో వసూలు చేస్తూనే ఉంటుంది.

పార్వతి మెల్టన్:

వెన్నెల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. పార్వతి మెల్టన్ ను చూస్తుంటే అచ్చం బొమ్మలాగా ఉంటుంది. ఆరడుగుల లాంటి శిల్పి చెక్కిన బొమ్మలాంటి రూపం తనది. అయితే తన పరిస్థితి కూడా అంతే.. మొదట్లో రెండు మూడు సినిమాల్లో సోలో హీరోయిన్ పాత్రలు చేసినాగాని, ఆ తరువాత కనుమరుగు అయింది. సెకండ్ హీరోయిన్ అయినా కానీ అడ్జస్ట్ అయ్యింది. అయితే, ఆశలన్నీ కూడా త్రివిక్రమ్ డైరెక్టర్ గారి మీద పెట్టుకుంది. ఎక్కడ ఏమయిందో తెలియదు కానీ దెబ్బ కొట్టింది. ఒకానొక సమయంలో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. అయితే ఆ సమయంలోనే చిన్నా చితక సినిమాలు చేసే అవకాశం వచ్చిన కానీ చేయకుండా వదిలేసి అమెరికా వెళ్లిపోయింది పార్వతి మెల్టన్. ఆ తర్వాత తన కెరీర్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది.

ప్రణీత:

ఈ హీరోయిన్ మొదట్లో సోలో హీరోయిన్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ తో ప్రణీత దశ మొత్తం మారిపోయింది. ఇక అప్పటినుంచి ఈ ప్రణీత అన్ని సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తూ వస్తుంది. అయితే తనది హీరోయిన్ రేంజ్ కాదు అని అందరూ అనుకుంటారు. కానీ, తను మాత్రం నేను హీరోయిన్ అనే అభిప్రాయంలో ఉంటుంది.

ప్రగ్యా జైస్వాల్:

మంచు బొమ్మ లాంటి రూపం కానీ.. టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయితే ఈ భామ తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఈ భామని ఐరన్ లెగ్ గా భావించారు. ఒకానొక సమయంలో అందాల ఆరబోతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నందిత:

తన 20 ఏళ్ల వయసులో ప్రేమ కదా చిత్రం తో మనకు పరిచయమైన నందిత ఆ సినిమాతో బాగానే పేరు తెచ్చుకుంది. కానీ నందిత పూర్తిగా తెలుగమ్మాయి అవటమే దెబ్బ తీసిందని చెప్పవచ్చు. అన్ని సినిమాల్లో హీరోయిన్ అని చెప్పి తీసుకుంటున్నారు. కానీ పాత్రకి తగ్గా ఇంపార్టాన్స్ ఇవ్వడం లేదు. పాత్రలు నచ్చకపోయినా వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోయింది. చివరాకరికి పరిస్థితి ఎలా ఉందంటే అసలు నందిత ఇండస్ట్రీలో ఉందా..? లేదా..? అనే పరిస్థితి వచ్చింది.

అర్చన:

అర్చన మొదట్లో హీరోయిన్ రోల్స్ చేసింది. తరువాత రాను రాను తన పరిస్థితి కూడా దిగజారిపోయింది. స్టార్ హీరోయిన్ గానే కెరీర్ మొదలు పెట్టిన కానీ మైన్ హీరోయిన్ అవకాశాలు రాక, తనకి నచ్చిన నచ్చకపోయినా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చింది. ఎందుకంటే నేను ఉన్నాను అన్నా విషయాన్నీ అభిమానులు మర్చిపోతారు అన్న భావంతో తనకు వచ్చిన ప్రతి సినిమాలు చేస్తూ వచ్చింది.

ఇదండీ మొదట్లో మన హీరోయిన్లుగా చేసి తరువాత అవకాశాలు లేక సర్దుకుపోయేవాళ్ల లిస్ట్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది విటమిన్ లోపం హెచ్చరిక కావచ్చు!

మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…

23 hours ago

బెండకాయలో దాగిన హెల్త్ పవర్… షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఫుడ్!

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…

23 hours ago

ఇంట్లో ఈ మూలలో నీళ్లు పెడితే… డబ్బు ప్రవాహం ఆగదు అంటున్నారు!

ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…

23 hours ago

రోజూ పిస్తా తింటున్నారా? ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యమే!

రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…

24 hours ago

చేతులు చూస్తేనే తెలిసిపోతుంది… మీ కొలెస్ట్రాల్ స్థాయి!

మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…

24 hours ago

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… శ్రీశైలంలో చలివేంద్రాల ఏర్పాటు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…

24 hours ago