Featured

శోభన్ బాబు గొప్పతనం తెలిస్తే.. చెయ్యి ఎత్తి దండం పెడతారు !!

తెలుగు సినీ చరిత్రలో ఎందరో గొప్ప నటీ నటులను మనము చూసే ఉంటాము. జీరో స్థాయి నుంచి ఎదిగి ఎన్నో అవార్డులను సాధించి, ఎంతో పేరు ప్రఖ్యాతలను ఎంతో కీర్తిప్రతిష్టలను సాధించిన వాళ్లను కూడా మనం చూసే ఉంటాము. అలా ఒక గొప్ప స్థాయికి ఎదిగి, ఎందరో అభిమానులను సొంతం చేసుకుని, వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు శోభన్ బాబు. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి. ఎందుకంటే శోభన్ బాబు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. శోభన్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ఉంది.

మన తెలుగు చిత్రసీమ అందగాడు మన శోభన్ బాబు. ఎందరో ఆడవాళ్ళ మనసుని కుడా దోచుకున్న నటుడు ఈయన. శోభన్ బాబు చాలా అందంగా ఉండేవాడు. అలాగే శోభన్ బాబు కి జుట్టే అందం. శోభన్ బాబు జుట్టుకు ఉండే రింగ్ చాలా ఫేమస్ అయింది. అంతటి గొప్ప సినీ నటుడు గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ రోజు మీకోసం. ఈయన 1937 జనవరి 13న జన్మించాడు. అంటే సంక్రాంతి పండుగ రోజున జన్మించారు. అలాగే 1952 లో భక్త శబరి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగప్రవేశం చేశాడు. ఆయన సినిమా రంగంలోకి రాక ముందు అనేక నాటక ప్రదర్శనలను ఇచ్చారు. ఆయన రాక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక కొత్తదనాన్ని తీసుకువచ్చింది. అప్పట్లో మంచి అందగాడుగా, రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో శోభన్ బాబు గారు ఒకరు. అలనాటి మేటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి టాప్ హీరోల జాబితాలో చేరిపోయారు శోభన్ బాబు గారు. దాదాపు 200 పైగా సినిమాలు చేసి ఎక్కడలేని స్టార్ డమ్ ను సంపాదించుకుని, చిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపేశాడు శోభన్ బాబు.

ఆయన గురించిన ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే.. అప్పట్లో శోభన్ బాబుతో నటించాలంటే హీరోయిన్లు అందరూ పడి చచ్చిపోయేవారట. శోభన్ బాబుతో సినిమా అంటే హీరోయిన్లంతా నేనంటే నేను అని పోటీపడేవారట. అయితే కేవలం సిల్వర్ స్క్రీన్ మీద మనకు కనిపించే శోభన్ బాబు ఎంత మంచివారో, వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విలువలతో ముందుకు సాగిపోయేవారు. శోభన్ బాబు తన జీవితాన్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో సాధించకొచ్చాడు. తనకు తగ్గ పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రలో ఎలా నటించాలో అనే తరహాలో ఆయనను ఆయనే మలుచుకునే వాడు. అభిమానులు ఆరాధించే తన అందాన్ని కాపాడుకోవడానికి, అలాగే తాను అందంగా కనిపించడానికి ఎప్పటికప్పుడూ శరీరంపై దృష్టి పెట్టే వాడు. యోగ, వ్యాయామాలు చేస్తూ ఎంతో ఆరోగ్యంగా కనిపించేవాడు. అలా సినిమా రంగంలో ఎన్నో సినిమాలు తీసి మంచి హిట్లు సాధించి, ఒక గొప్ప నటుడిగా గుర్తింపు పొందాడు. అయితే కొంతకాలం తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. వయసు పెరుగుతున్న కొద్దీ మిగతా హీరోల లాగా శోభన్ బాబు బయట అభిమానులకు కనిపించడం మానేసాడు. కారణం ఏంటి అని అడిగితే తాను అందగాడిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి, ఎందరో అభిమానుల దృష్టిలో సోగ్గాడుగా చెరగని ముద్రగా మారిపోయాను. ఇంకా వాళ్ళ అందరి గుండెల్లో నా ముఖచిత్రం అంతే అందంగా అలాగే ఉండిపోవడం నాకిష్టం. ఇంకా ఈ వృద్ధాప్యంలో ఇక తాను తన అభిమానులకు కనిపించి వాళ్ళని నిరుత్సాహపరచడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు నన్ను చూసి నా అభిమానులు నిరుత్సాహ పడకూడదు, అందుకనే వయసు పైబడిన తరువాత నేను అభిమానులకు కనపడటం నాకు ఇష్టం లేదు అని సినిమారంగం నుంచి విరామం తీసుకున్నాడు.

అయితే అలా సినీ రంగం నుంచి విరామం తీసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా ఏ సినిమా ఫంక్షన్స్ కు గాని, చిత్ర సీమలో జరిగే అవార్డుల ఫంక్షన్స్ కు గాను రాలేదు. శోభన్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే తన మాస్టారు కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. శోభన్ బాబు భార్య పేరు శాంత కుమారి. శోభన్ బాబుకు నలుగురు పిల్లలు. వాళ్లలో ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కూతుర్ల పేర్లు ప్రశాంతి, నివేదిత, మృదుల. కొడుకు పేరు కరుణ శేషు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. సినిమా రంగంలో ప్రవేశించిన వాళ్ళు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ వారసులల్లో ఎవరో ఒకరని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న శోభన్ బాబు.. తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పేవాడు కాదు. అలాగే తన వారసులను ఎవరిని కూడా సినిమా రంగంలోకి తీసుకురావటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు శోభన్ బాబు. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే కాకుండా సినీ రంగంలో ఉన్న రాజకీయ ఒడిదొడుకులను తన కుటుంభ సభ్యులు ఎవ్వరు కుడా ఎదుర్కోకూడదని, ఆ కష్టాలు తన పిల్లలు పడకూడదని, తన పిల్లల్ని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనివ్వలేదు. ఎవరికి నచ్చినట్టు వారి యొక్క జీవితాన్ని మలిచారు.

ఇక పిల్లలందరినీ మంచి వ్యాపారాల్లో పెట్టి, మంచి వ్యాపారస్తులుగా తీర్చిదిద్ది, వాళ్లకు ఇష్టమైన పని ఎంచుకోమని చెప్పారు. భార్య శాంతకుమారి. పేరుకి తగ్గట్టే శోభన్ బాబు భార్య కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శాంతంగా అణుకువగా ఉంటూ శోభన్ బాబు సినీ ప్రయాణంలో చేదోడు వాదోడుగా ఉండేది. శోభన్ బాబు గారు తన 71 వ ఏట గుండెపోటుతో మరణించారు చెన్నైలోని తన స్వగృహంలో మరణించారు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో, మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు, దానాలు చేసినా, ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు. సిల్వర్ స్క్రీన్ పై ఒక ఊపు ఊపేసిన అంతకాలం శోభన్ బాబు గారు తన వ్యక్తిగత విషయాలను ఎవరికీ పంచుకోవటానికి ఇష్టపడేవారు కాదు. ఇకపోతే శోభన్ బాబు అభిమానులు అంతా తమ హ్యాండ్సమ్ హీరో అయిన శోభన్ బాబే ఇలా ఉంటే శోభన్ బాబు యొక్క వారసులు ఇంకా ఎంత అందంగా ఉంటారో అని చాలా ఆతృతగా ఎదురు చూసేవారు. కానీ, శోభన్ బాబు తన పిల్లల్ని తన భార్యను కానీ, బందు మిత్రులను కానీ ఎలాంటి పరిస్థితులలోనూ బహిర్గతం చేయలేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది విటమిన్ లోపం హెచ్చరిక కావచ్చు!

మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…

1 day ago

బెండకాయలో దాగిన హెల్త్ పవర్… షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఫుడ్!

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…

1 day ago

ఇంట్లో ఈ మూలలో నీళ్లు పెడితే… డబ్బు ప్రవాహం ఆగదు అంటున్నారు!

ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…

1 day ago

రోజూ పిస్తా తింటున్నారా? ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యమే!

రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…

1 day ago

చేతులు చూస్తేనే తెలిసిపోతుంది… మీ కొలెస్ట్రాల్ స్థాయి!

మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…

1 day ago

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… శ్రీశైలంలో చలివేంద్రాల ఏర్పాటు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…

1 day ago