సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మంచి గ్లామరస్ పాత్రలు మాత్రమే చేయడం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కుడా చేయాలి. అప్పుడే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. అలాకాకుండా అంద చందాల అరోబోతల పాత్రలలో నటిస్తే కొంతకాలం తరువాత కనుమరుగయ్యి పోతారు. అలా పడి పోయిన ఒక్కప్పటి హీరోయిన్ సురభి. సురభి హీరోయిన్ గా ఎన్నో గ్లామరస్ పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. చూపు తిప్పుకోలేని అందం సురభి సొంతం. కేవలం అందానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రాలలో మాత్రమే నటించడం వల్ల ప్రేక్షకులు సైతం కొన్ని రోజుల తరువాత ఈ హీరోయిన్ ను మర్చిపోయారు. ఎన్నో సినిమాల్లో గ్లామరస్ పాత్రలలో నటించి మంచి హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది కానీ, మంచి టాలెంటెడ్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్ గా పేరు సంపాదించలేకపోయింది.
ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ పాత్రల్లో నటించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు సురభి మళ్ళీ సినిమాల్లో నటించడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో గ్లామరస్ పాత్రలు చేసింది కానీ పెర్ఫార్మన్స్ పాత్రలు చేయలేదు. కానీ, ఇప్పుడు నటనకు ఆస్కారం ఉండే పాత్రల్లో నటించాలని భావిస్తోందట. 1994 లో జెడి చక్రవర్తి హీరోగా నటించిన మని మని సినిమాలో హీరోయింగ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె స్వతహాగా గుజరాతి అమ్మాయి. ఈ హీరోయిన్ నటించిన సినిమాలు తక్కువే ఉన్నాయి. చేసింది కొన్ని సినిమాలు అయిన గాని అవి ఈ హీరోయిన్ కి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి కుర్రకారును ఒక ఊపు ఊపింది. అయితే కేవలం మూడు అంటే మూడు సంవత్సరాలు మాత్రమే హీరోయిన్ గా నటించిందని చెప్పాలి. ఈమె హీరోయిన్ గా మని మని సినిమా తర్వాత అల్లరోడు, ధర్మరాజు, పల్నాటి పౌరుషం, సింహ గర్జన, కొండపల్లి రత్తయ్య, కేటు, డూప్లికేటు, భరత సింహ, డియర్ బ్రదర్ వంటి సినిమాల్లో నటించింది. నటించింది తక్కువ సినిమాలే అయినాగానీ అప్పట్లో సురభికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక తాను హీరోయిన్ గా ఉన్న సమయంలోనే తెలుగులో కాకుండా కన్నడ, తన మాతృబాష అయిన గుజరాతిలో కుడా ఎన్నో సినిమాల్లో నటించింది. సినిమాల్లోనే కాకుండా గుజరాతి భాషలోని ఎన్నో సీరియల్స్ లో కుడా నటించింది.
ఇక టీవీ సీరియల్ యాక్టర్ అయిన పరేమేష్ వ్యాస్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆ తరువాత కనుమరుగయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అనుకుందట. అయితే ఇప్పుడు సురభిని చూస్తే మనం అసలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. తన అంద చందాలతో అందరిని అలరించిన ఆమె ఇప్పుడు గనుక మనం చూస్తే అసలు అప్పటి హీరోయిన్ సురభియేన అని అనుకుంటాము. చాలా లావు అయ్యింది. ఎంతో వయ్యారంగా కనిపించిన సురభి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సురభి హిందీలో కుడా సీరియల్స్ లో నటించింది. ఒకప్పుడు హిందీలో నుంచి మన తెలుగులోకి వచ్చిన కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ అప్పట్లో మాటీవీ లో ప్రసారమయ్యేది. ఈ సీరియల్ లో అత్త పాత్రలో నటించింది ఎవరో కాదు అలనాటి గ్లామరస్ హీరోయిన్ సురభినే. ఏది ఏమయినప్పటికీ సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ హీరోయిన్ మళ్ళీ తిరిగి తెలుగులో కుడా నటించాలని అనుకుంటుందట. తనకు తగ్గ పాత్ర వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…