రోగుల ముందే దారుణంగా కొట్టుకున్న డాక్టర్ – నర్సు.. వైరల్ వీడియో!

ప్రస్తుతం మన దేశం ఎంతో విపత్కర పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో వైద్యాధికారులపై అధిక ఒత్తిడి కలుగుతుంది. ఈ క్రమంలోనే ఓ నర్సు డాక్టర్ కొట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా ఆసుప‌త్రిలో జరిగింది. మరణ ధ్రువీకరణ పత్రం విషయంలో వీరిద్దరి మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది.

ఓవైపు ఆస్పత్రి మొత్తం కరోనా బాధితులతో నిండి పోవడం వల్ల ఎంతో ఒత్తిడికి గురైన ఆస్పత్రి సిబ్బంది వారు సహనం కోల్పోయి చివరకు ఈ విధంగా కొట్టుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.14 సెకండ్ నిడివి ఉన్న ఈ వీడియో లో నర్స్ డాక్టర్ పై “హై తేరీ ఔకాత్” అని నర్సు డాక్టర్‌ను ప్రశ్నిస్తూ చేయి చేసుకుంది. ఈ విధంగా నర్సు డాక్టర్ పై చేయి చేసుకోవడంతో సహనం కోల్పోయిన డాక్టర్ తిరిగి నర్స్ పై చేయి చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్, నర్స్ ఈ విధంగా కొట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే.. అనారోగ్యంతో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.దీంతో ఆ మృతుని బంధువులు అతని మరణ ధ్రువీకరణ పత్రం కావాలని నర్స్ ను సంప్రదించారు. దీంతో ఆ నర్స్ వెళ్లి డాక్టర్ కి విషయం తెలియజేసింది. అయితే డాక్టర్ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో మృతుడి బంధువులు పదేపదే సతాయించడం వల్ల సహనం కోల్పోయిన నర్స్ డాక్టర్ పట్ల ఈ విధంగా ప్రవర్తించిందని తెలుస్తోంది.

ఈ విధంగా డాక్టర్, నర్స్ గొడవపడే సమయంలో వారితో పాటు మృతుని బంధువులు ఆసుపత్రి సిబ్బంది కూడా ఉన్నారు. ఈ సంఘటనపై రాంపూర్ నగర మేజిస్ట్రేట్‌ రాంజీ మిశ్రా విచారణ జరపగా అధిక పని ఒత్తిడి వల్లే ఈ విధంగా ప్రవర్తించారని ప్రాథమిక నిర్ధారణలో తేలినట్లు రాంజీ మిశ్రా వివరించారు. ఏది ఏమైనా వైద్య సిబ్బంది ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకోవడంతో ఈ వీడియో వైరల్ అయింది.