కరోనా శవాలను పీక్కుతింటున్న రాబందులు, కుక్కలు.. ఎక్కడంటే?

దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు రోజు రోజుకూ దిగజారి పోతున్నాయి.ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకుండా పోతుందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా నదులలో మృతదేహాలు కొట్టుకు రావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది.గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకురావడం బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో కలకలం రేపింది. మహదేవ్ ఘాట్ వద్ద కిలోమీటర్ల పరిధిలో సుమారు 50కి పైగా మృత దేహాలు కొట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కరోనా బారినపడి మృతి చెందినవారి అంత్యక్రియలను నిర్వహించకుండా ఈ విధంగా నదిలో పడేస్తున్నట్లు పోలీసులు భావించారు. వారం రోజుల నుంచి మహాదేవ్ ఘాట్ వద్ద డజన్ల కొద్ది సేవలు కొట్టుకు రావడంతో ఆ శవాలను రాబందులు, కుక్కలు పీక్కు తింటున్నాయి.

కొందరు మహదేవ్ ఘాట్, చౌసా, మిశ్రావలియాచుట్టుపక్కల గ్రామాల నుంచి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ ఉన్న దృశ్యాలను చూసి అంతక్రియలు నిర్వహించకుండా వెనక్కి వెళ్తున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కరోన బారినపడి కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా ఆ శవాలను గంగానదిలో పడటం వల్ల కుక్కలు, రాబందులు పీక్కు తినడం చూస్తుంటే మన దేశంలో కరోనా ఏవిధంగా ప్రళయం సృష్టిస్తుందో అర్థమవుతోంది. కనుక ఈ మహమ్మారి నుంచి బయట పడటానికి మార్గం తగిన జాగ్రత్తలు పాటించడమేనని అధికారులు తెలియజేస్తున్నారు.